Jio True 5G: ఆంధ్రప్రదేశ్ లోని మరో రెండు నగరాలకు 5G నెట్ వర్క్.!

HIGHLIGHTS

ఆంధ్రప్రదేశ్ లోని మరో రెండు నగరాలకు అందించిన 5G నెట్ వర్క్

అంచెలంచెలుగా తన 5G సర్వీస్ లను విస్తరిస్తున్న రిలయన్స్ జియో

ఆంధ్రప్రదేశ్ లో 5G నెట్ వర్క్ అందుకున్న నగరాల సంఖ్య 6 కు పెరిగింది

Jio True 5G: ఆంధ్రప్రదేశ్ లోని మరో రెండు నగరాలకు 5G నెట్ వర్క్.!

Jio True 5G: ఆంధ్రప్రదేశ్ లోని మరో రెండు నగరాలకు 5G నెట్ వర్క్. దేశంలో అంచెలంచెలుగా తన 5G సర్వీస్ లను విస్తరిస్తున్న రిలయన్స్ జియో కొత్తగా ఆంధ్రప్రదేశ్ లోని మరో నగరాలతో సహా మొత్తం 10 నగరాలలో Jio True 5G సర్వీస్ లను ప్రారంభించింది. ఇటీవలే, ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు నగరాలలో 5G నెట్ వర్క్ ప్రారంభించిన జియో, ఇప్పుడు మరో రెండు నగరాలను కూడా ఈ లిస్ట్ లో జత చేసింది. దీనితో, ఆంధ్రప్రదేశ్ లో 5G నెట్ వర్క్ అందుకున్న నగరాల సంఖ్య 6 కు పెరిగింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా, విజయవాడ, గుంటూరు, తిరుమల మరియు విశాఖపట్నం సిటీలలో జియో తన Jio True 5G సర్వీస్ లను ప్రారంభించగా, ఇప్పుడు ఈ లిస్ట్ లో తిరుపతి మరియు నెల్లూరు నగరాలను కూడా జత చేసింది. అంటే, ఇప్పుడు ఈ ఆరు నగరాలలో వినియోగదారులు జియో ట్రూ 5జి సర్వీస్ లను అందించవచ్చు. అంతేకాదు, ఈ నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందుతారని కూడా జియో వెల్లడించింది.

మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo