Jio 5G: రిలయన్స్ జియో శరవేగంగా తన Ture 5G సర్వీస్ లను విస్తరిస్తోంది. ముందుగా, రాజధాని నగరం హైదరాబాద్ లో 5G నెట్ వర్క్ ను తీసుకొచ్చిన జియో, ఇప్పుడు తెలంగాణ లోని మరో రెండు ప్రధాన నగరాలలో కూడా జియో 5G నెట్ వర్క్ ను లాంచ్ చేసింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన వరంగల్ మరియు కరీంనగర్ రెండు నగరాలలో కూడా జియో తన True 5G సర్వీస్ లను కొత్తగా ప్రారంభించింది. ఈ రెండు నగరాలను కలుపుకొని మొత్తం 93 ప్రధాన నగరాలలో Jio True 5G సర్వీస్ లు అందుబాటులోకి వచ్చాయి.
Survey
✅ Thank you for completing the survey!
Jio True 5G సర్వీస్ లను తెలంగాణ రాష్ట్రంలో ముందుగా హైదరాబాద్ లో ప్రారంభించగా, ఇప్పుడు ఈ లిస్ట్ లో వరంగల్ మరియు కరీంనగర్ నగరాలను కూడా జతచేసింది. అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి మొత్తం మూడు నగరాలలో జియో 5G నెట్ వర్క్ అందుబటులోకి వచ్చింది. అంతేకాదు, ఈ నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందుతారని కూడా జియో వెల్లడించింది.
మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile