జియో పటాకా అఫర్: రూ.91 కే 28 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందుకోండి.!
91 రూపాయలకే 28 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే Jio బెస్ట్ అఫర్
91 రూపాయల ప్లాన్ తో 28 రోజులు పాటు అన్లిమిటెడ్ కాలింగ్
డైలీ డేటా మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను కస్టమర్లు పొందుతారు
జియో తన కస్టమర్లకు కేవలం 91 రూపాయలకే 28 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే బెస్ట్ అఫర్ ను కూడా అందించింది. జియో యొక్క ఈ 91 రూపాయల ప్లాన్ తో 28 రోజులు పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను కస్టమర్లు పొందుతారు. అంతేకాదు, ఈ ప్లాన్ మాదిరిగా అధిక ప్రయోజనాలను తక్కువ ధరకే అందించే మరిన్ని గొప్ప ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ ప్లాన్ లను గురించి ఈరోజు తెలుసుకుందామా.
SurveyJioPhone రూ.91 ప్లాన్
ఈ ప్లాన్ కేవలం కేవలం జియోఫోన్ కస్టమర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే కష్టమరలకు 28 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 100 MB మరియు 200MB అదనపు డేటా చొప్పున మొత్తం 3GB డేటాతో వస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 50 ఉచిత SMS లను కూడా ఈ ప్లాన్ తో పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ తో అన్ని జియో ప్రముఖ యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
అలాగే, జియో కస్టమర్లకు అధిక ప్రయోజాలను అందించే మరిన్ని ప్లాన్స్ గురించి క్రింద చూడవచ్చు.
జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటాను కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ తో అన్ని జియో ప్రముఖ యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
జియో రూ.783 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.783 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 112GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక మూడు నెలల డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.
జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75GB అదనపు డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.
రోజు అధిక డేటా మరియు 1499 రూపాయల విలువైన ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా చేసే ప్లాన్ కూడా వుంది. ఈ ప్లాన్ వివరాలను క్రింద చూడవచ్చు.
జియో రూ.4,199 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.4,199 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 1095 GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు 1499 రూపాయల విలువైన ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.
మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile