జియో బెస్ట్ ప్లాన్: కేవలం రూ.399 కే Netflix తో సహా 3 OTT ప్లాట్ఫారాలకు ఉచిత సబ్ స్క్రిప్షన్..!!
జియో కస్టమర్లకు ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అఫర్ చేసే బెస్ట్ ప్లాన్
జియో కస్టమర్లకు నెలకు రూ.399 రూపాయలకే ఈ అవకాశాన్ని అందిస్తోంది
ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారాల హావ కొనసాగుతోంది
జియో తన కస్టమర్లకు ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ అయిన Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్ లను అందించింది. అదికూడా కేవలం నెలకు రూ.399 రూపాయలకే ఈ అవకాశాన్ని అందిస్తోంది. వాస్తవానికి, ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారాల హావ కొనసాగుతోంది. సీరియల్స్, టైం కు వచ్చే సెలెక్టెడ్ సినిమాల నుండి ప్రజలు కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు మారుతున్నారు. దీనికరణం గానే ప్రతి ఒక్కరూ OTT ని ప్లాట్ ఫారాలను ఎంచుకుంటున్నారు. అందుకే, జియో కూడా తన కస్టమర్లకు Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ మూడు OTT ప్లాట్‌ఫారమ్స్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ ను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ అందించింది.
Surveyఅయితే, ఇది ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం కాదు. ఈ ప్లాన్ లను కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. రూ.399 ప్లాన్ వీటిలో బెస్ట్ అని చెప్పొచ్చు మరియు ఈ ప్లాన్ అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాబాలాను అందిస్తుంది.
Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.
ఇదే లాభాలను అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడాతీసుకువస్తాయి. అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది.
మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
