జియో 4G హావా : 4G లభ్యతలో టాప్ ప్లేస్

జియో 4G హావా : 4G లభ్యతలో టాప్ ప్లేస్

లండన్ ఆధారిత మొబైల్ విశ్లేషణ సంస్థ అయినటువంటి " OpenSignal "  భారతదేశంలో 4G లభ్యతలో జియో అన్నింటికంటే ముందునట్లుగా ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారంగా, జియో ఆరునెలల క్రితం ప్రకటించిన 96.7 శాతం లభ్యతతో పోలిస్తే, ఇప్పుటి వివరాల ప్రకారం 97.5 శాతం లభ్యతతో మొదటి స్థానంలో నిలవడమే కాకుండా  తన వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేనటువంటి సేవలను అందిస్తున్నట్లు, ఈ బ్రిటన్ సంస్థ ప్రశంసలు అందుకుంది.

ఇందులో కొత్తగా ఏముంది అనుకోకండి. ఎందుకం, టెక్నాలజీ పరంగా అందరికంటే ముందుడే అమెరికా లోని ఉత్తమ టెలికం సంస్థలు కేవలం 90శాతం లభ్యతని మాత్రమే అందిస్తున్నాయి. OpenSignal దీని గురించి తన నివేదికలో స్వయంగా ఏ విషయాన్ని గురించిం పేర్కొవడం విశేషం. కేవలం ఇదొక్కటే కాదు, మరికొన్ని ఇతర దేశాలను కూడా పోల్చి చూసినట్లయితే, యావత్ ప్రపంచంలోనే  రిలయన్స్ జియో ప్రధమ స్థానంలో నిలుస్తుంది.

ఇది మాత్రమే కాదు, గతనెలలో Uk సంస్థ ప్రకటించిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అతితక్కువ ధరకి డేటా లభిస్తున్నదేశాలలో భారతదేశానికి మొదటి స్థానం దక్కింది. అంటే, ప్రపంచంలో అందరికంటే ట్టకువ ధరకి మనం డేటాని అందుకుంటున్నామన్నమాట. ఒక GB డేటా కోసం, కేవలం $ 0.26 (18.34 రూపాయలు) ధర చల్లిస్తున్నాము. ఇక రెండవ స్థానంలో  క్యాగేస్తాన్  నిలవగా మూడు మరియు నాలుగు స్థానాల్లో,  మరియు  కజకిస్థాన్ మరియు ఉక్రెయిన్ లు వరుసగా నిలిచాయి. ఇందులో కూడా అతితక్కువ ధరకే 4G అందిస్తున్న టెలికం సంస్థగా జియోనే నిలుస్తుంది.                                 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo