జియో సునామి అఫర్: కేవలం రూ.1 రూపాయకే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది

Updated on 16-Dec-2021
HIGHLIGHTS

రిలయన్స్ జియో 1 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ను చాలా సైలెంట్ గా లాంచ్ చేసింది

30 రోజుల వ్యాలిడిటీ మరియు 100MB డేటా

ఈ ప్లాన్ మీకు వెబ్సైట్ నుండి లభించడం లేదు

రిలయన్స్ జియో ఎన్నడూ లేని విధంగా 1 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ను చాలా సైలెంట్ గా లాంచ్ చేసింది. ఈ ప్లాన్  లాంచ్ సమయంలో 30 రోజుల వ్యాలిడిటీ మరియు 100MB డేటాని కూడా అఫర్ చేసింది. అయితే, ఒక్కరోజులోనే ఆ ప్లాన్ డేటా మరియు వ్యాలిడిటీ లను తగ్గించింది. అంతేకాదు, ఈ ప్లాన్ మీకు వెబ్సైట్ నుండి లభించడం లేదు. ఈ ప్లాన్ My Jio App నుండి అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ రూ.1 ప్లాన్ కేవలం 1 రోజు వ్యాలిడిటీ మరియు 10MB డేటాను అఫర్ చేస్తోంది.   

ఇది మాత్రమే కాదు జియో కేవలం 119 రూపాయలకే డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS లతో సహా అన్ని ప్రయోజాలతో కొత్త ప్లాన్ ను కూడా అందించింది. ఇతర టెలికం కంపెనీల పైన మరింత భారాన్ని పెంచేలా తన రూ.119 రూపాయల అన్లిమిటెడ్ ప్లాన్ లో 300 ఉచిత SMS సౌకర్యాన్ని కూడా జతచేసింది. 

జియో రూ.119 ప్లాన్

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 1.5GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 21 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, 300 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

జియో యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :