Oppo Reno 12 Series ను ప్రకటించిన ఒప్పో.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

Updated on 24-May-2024
HIGHLIGHTS

Oppo Reno 12 Series ను స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ తో విడుదల చేసింది

ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెట్టింగ్ మరియు AI ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది

ఈ ఫోన్ లను చైనా మార్కెట్ లో విడుదల చేసింది

Oppo Reno 12 Series ను స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెట్టింగ్ మరియు AI ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫోన్ లను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఒప్పో కొత్త ఫోన్ ల యొక్క ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Oppo Reno 12 Series

చైనాలో ఒప్పో రెనో 12 సిరీస్ నుండి రెండు ఫోన్ లను విడుదల చేసింది. ఇందులో Oppo Reno 12 మరియు Reno 12 Pro ఉన్నాయి. ఇందులో ఒప్పో రెనో 12 ఫోన్ ను ¥2999 (సుమారు రూ. 35,000) ప్రారంభ ధరలో మరియు రెనో 12 ప్రో ని ¥3399 (సుమారు రూ. 40,000) ప్రారంభ ధరలో ప్రకటించింది.

Oppo Reno 12 Series : ఫీచర్స్

ఒప్పో రెనో 12 సిరీస్ నుంచి అందించిన రెండు స్మార్ట్ ఫోన్ లలో దాదాపు ఒకే రకమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి. అయితే, ఈ రెండు ఫోన్స్ యొక్క మేజర్ వ్యత్యాసం ఈ ఫోన్స్ లో అందించిన ప్రొసెసర్ గా చెప్పవచ్చు. రెనో 12 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ Dimesnsity 8250 స్టార్ ఎడిషన్ ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ ఉండగా, రెనో 12 ప్రో లో మాత్రం Dimesnsity 9200+ స్టార్ స్పీడ్ ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ వుంది.

Oppo Reno 12 Series

ఈ రెండు ఫోన్ లు కూడా 12GB మరియు 16GB LPDDR5X RAM ఆప్షన్ లతో ఉంటాయి. అంతేకాదు, ఈ రెండు ఫోన్ లలో కూడా 512GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లతో వచ్చాయి. ఈ రెండు ఫోన్ లలో కూడా 80W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.

Also Read: మే 28న సెగ్మెంట్ టాప్ ఫీచర్స్ తో Realme Narzo N65 5G లాంచ్ అవుతోంది.!

ఈ రెండు 6.7 ఇంచ్ ProXDR డిస్ప్లేని కలిగి ఉన్నాయి. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ రెండు ఫోన్ లలో వెనుక 50MP + 50MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అయితే, 12 Pro ఫోన్ లో 50MP Sony IMX890 మెయిన్ సెన్సార్ ఉంటుంది.

ఈ ఫోన్స్ ఇండియా లాంచ్ గురించి ఎటువంటి వివరాలు కంపెనీ వెల్లడించలేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :
Tags: tech news