చవక ధరలో 200 గంటల ప్లే టైమ్ మరియు రివర్స్ ఛార్జింగ్ తో కొత్త బడ్స్ తెచ్చిన pTron

Updated on 24-May-2024
HIGHLIGHTS

pTron ఇండియన్ మార్కెట్లో భారీ బ్యాటరీ సెటప్ తో కొత్త ఇయర్ బడ్స్ ను అందించింది

ఈ ఇయర్ బడ్స్ గరిష్టంగా 200 గంటల ప్లే టైమ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది

ఈ బడ్స్ లో రివర్స్ ఛార్జింగ్ టెక్ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది

ఇండియన్ మార్కెట్లో భారీ బ్యాటరీ సెటప్ తో కొత్త ఇయర్ బడ్స్ ను pTron అందించింది. Zenbuds Evo X1 Max పేరుతో సరికొత్తగా విడుదల చేసిన ఈ ఇయర్ బడ్స్ గరిష్టంగా 200 గంటల ప్లే టైమ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ బడ్స్ లో రివర్స్ ఛార్జింగ్ టెక్ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది. పీట్రాన్ అందించిన ఈ కొత్త ఇయర్ బడ్స్ ప్రైస్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.

pTron Zenbuds Evo X1 Max

పీట్రాన్ ఈ జెన్ బడ్స్ Evo X1 మ్యాక్స్ ఇయర్ బడ్స్ ను రూ. 1,299 రూపాయల లాంచ్ ధరలో అందించింది. ఈ బడ్స్ ఈరోజు నుండి అమెజాన్ సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ ఎఆర్ బడ్స్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకుని వచ్చింది.

pTron ఇయర్ బడ్స్ ఫీచర్స్

పీట్రాన్ సరికొత్తగా అందించిన ఈ బడ్స్ మంచి కాలింగ్ కోసం Quad Mic మరియు TruTalk ENC ఫీచర్ తో వస్తుంది. డీప్ BASS అందించగల 13mm డైనమిక్ స్పీకర్ లను ఈ బడ్స్ కలిగి ఉంటాయి. ఈ బడ్స్ ను పవర్ బ్యాంక్ మాదిరిగా కూడా ఉపయోగించేలా రివర్స్ ఛార్జ్ టెక్ తో అందించింది.

pTron Zenbuds Evo X1 Max

ఈ బడ్స్ లో 1000mAh హెవీ బ్యాటరీ ఉంటుంది మరియు టైప్ C రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది. అత్యవసర సమయంలో ఈ బడ్స్ తో ఫోన్ లను ఛార్జ్ కూడా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ బాక్స్ తో టోటల్ 200 గంటల ప్లే టైమ్ అందిస్తుందని పీట్రాన్ చెబుతోంది.

Also Read: Oppo Reno 12 Series ను ప్రకటించిన ఒప్పో.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

ఈ బడ్స్ లో సీమ్ లెస్ టచ్ కంట్రోల్స్ మరియు ఫోన్ తో వాయిస్ అసిస్టెంట్ కోసం ఇన్స్టాంట్ యాక్సెస్ తో వస్తుంది. ఈ పీట్రాన్ బడ్స్ Bluetooth v5.3 తో వస్తుంది మరియు సీమ్ లెస్ కనెక్టివిటీ అందిస్తుంది. ఈ బడ్స్ IPX5 తో వాటర్ రెసిస్టెంట్ మరియు 40ms లో లెటెన్సీ తో కొద వస్తుంది.

ఈ కొత్త ఇయర్ బడ్స్ కేవలం 59 గ్రామల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ బడ్స్ Sound Isolation తో లీనమయ్యే సౌండ్ క్వాలిటీ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :
Tags: tech news