ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు పట్టణాలకు జియో ఫైబర్ సేవలు, ఉచిత ఆఫర్లు

ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు పట్టణాలకు జియో ఫైబర్ సేవలు, ఉచిత ఆఫర్లు
HIGHLIGHTS

AP లో మొత్తం 26 పట్టణాలలో జియో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.

జియో ఫైబర్ ‌ను ఉచితంగా ఉపయోగించటానికి ప్రయత్నించే అవకాశం ఉంది

అపరిమిత డేటాతో 30 రోజులు ఉచిత సేవ లభిస్తుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 23 పట్టణాల్లో తన అందిస్తున్న జియో ఫైబర్, ఇప్పుడు మరో మూడు పట్టణాలలో కూడా ప్రారంభమయ్యింది. దీనితో, AP లో మొత్తం 26 పట్టణాలలో జియో ఫైబర్ తన హై స్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. అధనంగా, జియో ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకునే కస్టమర్ల కోసం ఇప్పటికే అందుబాటులో ఉంచిన ఉచిత ట్రయల్ అఫర్ ను కూడా వినియోగించుకునే అవకాశం కూడా వుంటుంది.          

అంటే, ఏదైనా ప్లాన్ తీసుకునే ముందు, జియో ఫైబర్ ‌ను ఉచితంగా ఉపయోగించటానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ప్రస్తుతం,  OTT ప్లాట్ ‌ఫారమ్‌ లోని చలనచిత్రాల నుండి మొదలుకొని ఇంటి నుండి ఆన్ ‌లైన్ ‌లో పనిచేయడం వరకు – ప్రతి దానికీ ఇంటర్నెట్ వాడకం పెరిగింది. కాబట్టి, జియోఫైబర్ బ్రాడ్‌ బ్యాండ్ చందాదారుల సంఖ్య నానాటికి పెరిగింపోతోంది.

30 రోజులు ఉచిత ట్రయల్‌

ఈ ప్లాన్స్ లోని కొత్త కస్టమర్లందరికీ అపరిమిత డేటాతో 30 రోజులు ఉచిత సేవ లభిస్తుంది.  వినియోగదారులు మొదటి రీఛార్జ్ తర్వాత 30 రోజులు ఉచిత డేటాను ఉపయోగించగలరు. ఈ ప్లాన్ ‌తో వినియోగదారులకు 150 Mbps వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ ఉచిత ట్రయల్ ‌లో అప్ ‌లోడ్ మరియు డౌన్‌ లోడ్ రెండింటి వేగం సమానంగా ఉంటుందని సూచించింది. వీటితో పాటు, కొత్త చందాదారులకు సంస్థ తరపున 10 OTT యాప్స్  ఉచిత చందా ఇవ్వబడుతోంది. కస్టమర్లకు 4 K సెట్-టాప్ బాక్స్ లభిస్తుంది. దీని కోసం కస్టమర్ అదనపు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఈ సేవ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యింది.

జియో కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ల కింద 399, 699 మరియు 999 మరియు 1499 ధరలకు ప్రత్యేక ప్లాన్స్  ప్రకటించింది. ఇందులో, కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం …

JioFiber new Plan

  • జియోఫైబర్స్ టికె 399 ప్లాన్‌ తో వినియోగదారులకు 30 Mbps  స్పీడ్ లభిస్తుంది.
  • 699 ప్లాన్‌లో వినియోగదారులకు 100 Mbps స్పీడ్ లభిస్తుంది.
  • వినియోగదారులకు 150 Mbps వేగం కావాలంటే, రూ. 999 ఎంచుకోవాలి
  • 300 Mbps స్పీడ్ 1499 రూపాయల ప్లానుతో ఇవ్వబడుతుంది.
  • అదనంగా, రిలయన్స్ జియో అన్ని జియో ఫైబర్ ప్లాన్లు అన్లిమిటెడ్ ప్లాన్స్ అని పేర్కొంది.
  • గమనిక: జియో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo