జియో ధమాఖా అఫర్ : రూ. 699 ధరకే 4G ఫోన్ అఫర్ దీపావళి వరకూ మాత్రమే

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 Oct 2019
HIGHLIGHTS
  • ఈ పరిమిత ఆఫర్ దసరా మరియు దీపావళి మధ్య మాత్రమే

జియో ధమాఖా అఫర్ : రూ. 699 ధరకే 4G ఫోన్ అఫర్ దీపావళి వరకూ మాత్రమే
జియో ధమాఖా అఫర్ : రూ. 699 ధరకే 4G ఫోన్ అఫర్ దీపావళి వరకూ మాత్రమే

దీపావళి 2019 పండుగ కోసం జియో వినియోగదారులకు మంచి అఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకూ, ఎక్స్చేంజి మరియు ఇతర ఆఫర్లతో అమ్ముడుచేస్తున జియో ఫీచర్ ఫోన్ను,ఇప్పుడు ఈ పండుగ సేల్ ద్వారా ఎటువంటి ఎక్స్చేంజి మరియు ఇతర కండిషన్స్ లేకుండా కేవలం 699 రూపాయల తగ్గింపు ధరతో అమ్మడుచేస్తోంది. ఈ ఫీచర్ ఫోన్‌ను ఎటువంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకుండా డిస్కౌంట్ ధర వద్ద అమ్మనుంది. ఈ పరిమిత ఆఫర్ దసరా మరియు దీపావళి మధ్య మాత్రమే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

1,500 రూపాయల ధరతో రిలయన్స్ జియోఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేశారు. దీపావళి 2019 ఆఫర్ సందర్భంగా ఈ 4G ఫీచర్ ఫోన్‌ను రూ .699 కు ఆఫర్ చేస్తున్నారు. ఈ పండుగ సీజన్ సందర్భంగా ఈ ఫోన్ పైన 801 రూపాయల తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ఆఫర్ యొక్క ప్రత్యేక విషయం ఏమిటంటే, వినియోగదారులు ఈ డిస్కౌంట్ రేటుతో కొనుగోలు చేయడానికి బదులుగా పాత ఫోన్‌ను ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఫోన్ యొక్క సేల్ ఈరోజు నుండి jio.com  నుండి ఆన్లైన్ లో మరియు జియో స్టోర్ నుండి కూడా కొనవచ్చు.  

699 రూపాయలకు జియోఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులకు రూ .700 వరకు డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈఫోన్ ప్రారంభ 7 రీఛార్జిల కోసం కంపెనీ రూ .99 విలువైన అదనపు డేటాను కూడా అందిస్తుంది. వినియోగదారులు వినోదం, చెల్లింపు మరియు ఇ-కామర్స్ యాప్స్ కోసం ఈ అదనపు డేటాను ఉపయోగించవచ్చు.

స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ జియోఫోన్ ఒక 2.4-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. మరియు దీని డిజైన్ మార్కెట్‌లోని ఇతర ఫీచర్ ఫోన్‌ల మాదిరిగానే ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ KAI OS లో నడుస్తుంది మరియు స్ప్రెడ్‌ట్రమ్ 9820A లేదా డ్యూయల్ కోర్ క్వాల్కమ్ 205 ప్రాసెస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ జియో టివి, జియో సినిమా, జియో మ్యూజిక్ వంటి అనేక జియో యాప్‌లతో వస్తుంది. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status