జియో క్రికెట్ బొనాంజా : వరల్డ్ కప్ మ్యాచ్ లన్ని HOTSTAR నుండి ఫ్రీగా చూడండి

HIGHLIGHTS

దీనికోసం ఎటువంటి సబ్ స్క్రిప్షన్ చేయాల్సిన పనిలేదని జియో చెబుతోంది.

జియో క్రికెట్ బొనాంజా  : వరల్డ్ కప్ మ్యాచ్ లన్ని HOTSTAR నుండి ఫ్రీగా చూడండి

ICIC క్రికెట్ వరల్డ్ కప్ 2019,  మ్యాచులన్నీ కూడా ఫ్రీ గా ఆన్లైన్లో,  ఈ మొత్తం సిరీస్ LIVE చూడవచ్చు. దీని అర్థం మీరు ప్రతి బంతిని ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే, వీటన్నికి కూడా సరైన డేటా అవసరమవుతుంది. సాధారణంగా చేసుకునే రీచార్జీతో వచ్చే డేటా మన వీడియో మరియు హై ఎండ్ గమనింగ్ గేమింగ్ అవసరాలకే సరిపోతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Cricket pack jio intext.png

అయితే, మరి క్రికెట్ మ్యాచ్ LIVE Stream చూడాలనుకుంటే ఎలాగ ? అనుకోకండి, ఎందుకంటే క్రికెట్ అభిమానుల కోసం జియో ప్రకటించినటువంటి ప్రత్యేకమైన డేటా ప్యాక్ తో ఎక్కువ డేటాని మాత్రమే కాకుండా ఎక్కువ వ్యాలిడిటీని కూడా అందుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన క్రికెట్ డేటా ప్యాక్ రూ. 251 రూపాయల ధరతో అందుతుంది. ఇది 4G నెట్వర్క్ సర్వీస్ అందించే అన్ని టెలికం సంస్థల కన్నాచాల తక్కువ ధరతో తీసుకొచ్చునటువంటి ప్యాకేజీగా చెప్పొచ్చు.అలాగే, ఈ ప్యాకేజీతో రీచార్జ్ చేసుకునేవారు HOTSTAR నుండి ప్రతి క్రికెట్ క్రికెట్ మ్యాచ్ LIVE చూడవచ్చు, దీనికోసం ఎటువంటి  సబ్ స్క్రిప్షన్ చేయాల్సిన పనిలేదని జియో చెబుతోంది. 

ఇక ఈ ప్యాక్ విశేషాలను చూసినట్లయితే, ఈ రూ. 251 రూపాయల క్రికెట్ డేటా ప్యాక్ మీకు ఈ పూర్తి ICC క్రికెట్ వరల్డ్ కప్ 2019 పూర్తి సీజన్ చూడగలిగేంత, వ్యాలిడిటీ కాలపరిమితితో వస్తుంది. అదనంగా, దీనితో పూర్తిగా 102 GB హై స్పీడ్ 4G డేటాని అందుకుంటారు. ఏవరేజ్ గా రోజుకు 2GB వాడుకున్న కూడా పూర్తి వ్యాలిడికి ఈ డేటా సరిపోతుంది. ఇది క్రికెట్ అభిమానులకు సరైన ప్యాకేజీగా జియో చెబుతోంది.                  

 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo