IPL మ్యాచ్ లు చూడడానికి అధిక డేటా అవససరమా..ఈ జియో ప్లాన్స్ పైన ఒక లుక్కేయండి.!
IPL 2023 అట్టహాసంగా మొదలయ్యింది
IPL 2023 ఆన్లైన్ లో చూడడానికి అవసరమైన అధిక డేటా అందించే ప్లాన్స్
క్రికెట్ ప్రియుల కోసం జియో అందించిన బెస్ట్ ప్లాన్స్
IPL 2023 అట్టహాసంగా మొదలయ్యింది మరియు ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు కూడా మొదలయ్యాయి. IPL 2023 ని ఆన్లైన్ లో చూడడానికి అవసరమైన అధిక డేటా అందించే ప్లాన్ కోసం చూస్తునట్లయితే, జియో గొప్ప Cricket Plans ను కూడా అందించింది. ఈ ప్లాన్స్ తో రీచార్జ్ చేసే కస్టమర్లకు అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలను అఫర్ చేస్తోంది. మరి, క్రికెట్ ప్రియుల కోసం జియో
అందించిన ఆ బెస్ట్ ప్లాన్స్ పైన ఒక లుక్కేయండి.
SurveyJio Rs.219 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 14 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3 GB హై స్పీడ్ డేటా మరియు 2GB అదనపు డేటా కలిపి, మొత్తం 44 GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
Jio Rs.399 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3 GB హై స్పీడ్ డేటా మరియు 6GB అదనపు డేటా కలిపి, మొత్తం 90 GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
Jio Rs.999 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3 GB హై స్పీడ్ డేటా మరియు 40GB అదనపు డేటా కలిపి, మొత్తం 292 GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
గమనిక: Jio True 5G సర్వీస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని కస్టమర్లు పైన తెలిపిన అన్ని ప్లాన్స్ పైన అన్లిమిటెడ్ 5G డేటా సౌలభ్యాన్ని కూడా ఆనందించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile