Jio Hotstar సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందించే జియో టాప్ 3 ప్లాన్స్.!

Updated on 30-Nov-2025
HIGHLIGHTS

Jio Hot star ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్స్ యూజర్ల కోసం అందించింది

లైవ్ క్రికెట్ మ్యాచ్ లతో పాటు లైవ్ ఛానల్స్ కూడా ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు

జియో యూజర్ల కోసం జియో హాట్ స్టార్ ఉచిత యాక్సెస్ తో మూడు గొప్ప ప్లాన్స్ అందించింది

Jio Hot star ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తన యూజర్ల కోసం అందించింది. కొత్త సినిమాలు, లేటెస్ట్ సిరీస్ లు, లైవ్ క్రికెట్ మ్యాచ్ లతో పాటు లైవ్ ఛానల్స్ కూడా ఈ ఉచిత జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. వాటిలో టాప్ 3 ప్రీపెయిడ్ ప్లాన్స్ రోజు చూడనున్నాము. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా మీకు జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటు మరిన్ని లాభాలు అందిస్తాయి.

Jio Hot star టాప్ 3 ప్లాన్స్

జియో యూజర్ల కోసం జియో హాట్ స్టార్ ఉచిత యాక్సెస్ తో మూడు గొప్ప ప్లాన్స్ అందించింది. ఇందులో రూ. 100 ప్లాన్, రూ. 195 ప్లాన్ మరియు రూ. 949 మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా చాలా కాలం నుంచి జియో యూజర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లలో మొదటి రెండు ప్లాన్స్ కూడా డేటా ఓచర్లు కాగా మూడోది 84 రోజులు చెల్లుబాటు అయ్యే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్.

జియో రూ. 100 అండ్ రూ. 195 ప్లాన్

ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా డేటా ఓచర్లు మరియు వేగవంతమైన డేటా అందిస్తాయి. వీటిలో రూ. 100 రూపాయల డేటా ఓచర్ 30 వ్యాలిడిటీ తో వస్తుంది మరియు టోటల్ 5 జీబీ హాయ్ స్పీడ్ డేటా ఆఫర్ చేస్తుంది. ఒక రూ. 195 ప్లాన్ విషయానికి వస్తే ఇది కూడా డేటా ఓచర్ మరియు 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ 90 రోజులకు గాను 15 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. వీటిలో జియో రూ. 100 ప్లాన్ 30 రోజుల జియో హాట్ స్టార్ యాక్సెస్ మరియు జియో రూ. 195 ప్లాన్ 90 రోజుల జియో హాట్ స్టార్ యాక్సెస్ అందిస్తుంది.

Also Read: 7 వేల ధరలో 55 ఇంచ్ టీవీకి మూడింతల పెద్ద స్క్రీన్ అందించే బెస్ట్ Smart Projector డీల్స్.!

జియో రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ 5జి డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100SMS బెనిఫిట్స్ అందించే లాంగ్ వ్యాలిడిటీ అన్లిమిటెడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో 84 రోజుల జియో హాట్ స్టార్ ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో రూ. 35,100 రూపాయల విలువైన 18 నెలల గూగుల్ జెమినీ Ai ప్రో ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :