Jio best Plan: మూడు నెలలు ఎంటర్టైన్మెంట్ అందించే జియో బెస్ట్ ప్లాన్.!
మూడు నెలలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే బెస్ట్ ప్లాన్
Jio యూజర్లు మూడు నెలల పాటు ప్రముఖ OTT సబ్ స్క్రిప్షన్ అందుకుంటారు
ఈ రిలయన్స్ జియో అందించే పూర్తి ప్రయోజనాలు తెలుసుకోండి
Jio best Plan: రిలయన్స్ జియో యూజర్లకు మూడు నెలలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే బెస్ట్ ప్లాన్ ఒక అందుబాటులో ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు మూడు నెలల పాటు ప్రముఖ OTT సబ్ స్క్రిప్షన్ అందుకుంటారు. అంతేకాదు, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ఇతర లాభాలు కూడా పొందుతారు.
Surveyఏమిటా Jio best Plan?
రిలయన్స్ జియో లేటెస్ట్ గా అందించిన మూడు నెలల లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటుంది. అదే, జియో యొక్క రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ప్లాన్ గొప్ప ప్రయోజనాలు అందిస్తుంది. ఈ రిలయన్స్ జియో అందించే పూర్తి ప్రయోజనాలు తెలుసుకోండి.
రిలయన్స్ జియో రూ. 949 ప్లాన్
రిలయన్స్ జియో యొక్క ఈ రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ 5జి డేటా కూడా ఆఫర్ చేస్తుంది. అదే 4G నెట్ వర్క్ అయితే రోజుకు 2GB హై స్పీడ్ డేటా చొప్పున 84 రోజులకు 168GB హాయ్ స్పీడ్ డేట్ కూడా అందిస్తుంది.

ఈ జియో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం అందిస్తుంది. ఇవి కాకుండా జియో సినిమా, జియో క్లౌడ్ మరియు జియో టీవీ లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Also Read: Children’s Day Special: మీ పిల్లల కోసం కొనదగిన టాప్ 5 Tablets లిస్ట్.!
ఈ జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఇంతటితో అయిపోలేదు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లు 3 నెలల Disney+ HotStar మూడు నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా మరియు మూడు నెలల OTT సబ్ స్క్రిప్షన్ వంటి ఆల్ రౌండ్ ప్రయోజనాలు అందిస్తుంది.
మరిన్ని Jio ప్రె ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile