Jio Tv Pro: రూ. 55 రూపాయకే 1000 లైవ్ ఛానల్స్ తో కొత్త ప్లాన్ ప్రకటించిన జియో.!

HIGHLIGHTS

చవక ధరలో అనేక ప్లాన్స్ అందించిన జియో, ఇప్పుడు మరో ప్లాన్ ను కొత్తగా పరిచయం చేసింది

ఈ ప్లాన్ తో కేవలం రూ. 55 రూపాయకే 1000 కంటే ఎక్కువ లైవ్ ఛానల్స్ ను ఆఫర్ చేస్తుంది

వినియోగదారులు 30 రోజుల పాటు 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ను తమ స్మార్ట్‌ ఫోన్‌ లో వీక్షించవచ్చు

Jio Tv Pro: చవక ధరలో అనేక ప్లాన్స్ అందించిన జియో, ఇప్పుడు మరో ప్లాన్ ను కొత్తగా పరిచయం చేసింది. ఇది నిజంగా అద్భుతమైన ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ప్లాన్ తో కేవలం రూ. 55 రూపాయకే 1000 కంటే ఎక్కువ లైవ్ ఛానల్స్ ను ఆఫర్ చేస్తుంది. చవక ధరలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను ఈ కొత్త ప్యాక్ తో మీరు అందుకోవచ్చు. మరి జియో కొత్తగా విడుదల చేసిన ఈ 55 రూపాయల ప్యాక్ వివరాలు ఏమిటో చూద్దామా.

Jio Tv Pro: ఏమిటి ఈ ప్లాన్

వినియోగదారులకు మరింత తక్కువ ధరలో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రిలయన్స్ జియో కొత్తగా ఈ Jio TV Pro ప్యాక్‌ ను ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ ను కేవలం రూ.55 రూపాయల అతి చవక రేటుకే అందించింది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ ద్వారా వినియోగదారులు 30 రోజుల పాటు 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ను తమ స్మార్ట్‌ ఫోన్‌ లో వీక్షించవచ్చు.

జియో టీవీ (JioTV) యాప్ ద్వారా ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. సినిమాలు, వినోదం, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, సంగీతం, లైఫ్‌ స్టైల్, ప్రాంతీయ ఛానెల్స్ వంటి అనేక విభాగాలకు చెందిన కంటెంట్‌ ను ఈ సింగిల్ ప్యాక్‌ లో అందిస్తోంది. ఈ ప్యాక్‌ లో 16 కుపైగా భాషల్లో ప్రసారమయ్యే ఛానెల్స్ మరియు 150 కు పైగా ప్రీమియం టీవీ చానల్స్ కూడా అందుబాటులో ఉంటాయని జియో వెల్లడించింది.

Jio Tv Pro: బెనిఫిట్స్

ఇది సాధారణ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ కాదని మీరు గుర్తుంచుకోవాలి. రూ. 55 జియో టీవీ ప్రో ప్యాక్‌ లో మీకు ఎటువంటి అదనపు బెనిఫిట్స్’లభించవచ్చు. అంటే, కాలింగ్ లేదా SMS వంటి ప్రయోజనాలు ఉండవు. ఈ ప్లాన్ తో కేవలం 10MB డేటా మాత్రం అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ సర్వీస్ ఉపయోగించాలంటే వినియోగదారుడు ఏదైనా యాక్టివ్ జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌ పెయిడ్ కనెక్షన్‌ ను కలిగి ఉండాలి.

ఇది పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాల కోసం రూపొందించిన యాడ్ ఆన్ ప్యాక్. స్టార్, కలర్స్, సోనీ, ఈటీవీ నెట్ వర్క్, సన్ టీవీ నెట్ వర్క్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ వంటి వెయ్యికి పైగా ప్రముఖ టీవీ నెట్‌ వర్క్‌ లకు చెందిన అనేక ఛానెల్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి.

Also Read: జస్ట్ నెల క్రితం విడుదలైన 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్.!

కేవలం రూ. 100 లోపు రేటుకే ఇంత పెద్ద సంఖ్యలో లైవ్ టీవీ ఛానెల్స్‌ ను అందించడం ద్వారా బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించాలన్నదే జియో లక్ష్యంగా కనిపిస్తోంది. మొబైల్ లో ఎక్కడైనా, ఎప్పుడైనా టీవీ ఛానెల్స్‌ ను వీక్షించాలనుకునే వారికి ఈ ప్యాక్ మంచి ఎంపికగా నిలవవచ్చు. జియో అధికారిక రీఛార్జ్ ఛానెల్స్‌ తో పాటు MyJio యాప్, Jio వెబ్‌ సైట్ మరియు ఇతర రీఛార్జ్ ప్లాట్‌ ఫామ్స్ ద్వారా కూడా ఈ ప్యాక్‌ ను పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :