ఉచిత Wi-Fi కాలింగ్ ప్రకటించిన Reliance Jio : మీ ఫోనులో ఎలా సెట్ చేసుకోవాలి

ఉచిత Wi-Fi కాలింగ్ ప్రకటించిన Reliance Jio : మీ ఫోనులో ఎలా సెట్ చేసుకోవాలి
HIGHLIGHTS

ఈ ఉచిత కాలింగ్ సర్వీసును మీ ఫోనులు సెట్ చేసుకున్నారా? లేకపోతే ఇలా సెట్ చేసుకోండి.

ఇక నుండి ఎటువంటి అంతరాయం మరియు అస్పష్టత లేనటువంటి వాయిస్ కాలింగ్ మరియు వీడియో కాలింగ్ జియో వినియోగదారులకు పరిచయం అవుతుంది. అంతేకాదు, కాలింగ్ కోసం కూడా ఎటువంటి అధిక రుసుమును చెల్లించాల్సిన పనిలేదు. వాయిస్ మరియు వీడియో కాలింగ్ వాటి ప్రయోజనాలను ఉచితంగా చేసుకోవచ్చు. ఇదంతా కూడా జియో తీసుకొచ్చిన Wi-Fi కాలింగ్ వాల్ల సాధ్యమయ్యింది. ఇప్పుడు, ఈ సేవలను భారత దేశమంతటా ప్రకటించింది. మరి ఈ ఉచిత కాలింగ్ సర్వీసును మీ ఫోనులు సెట్ చేసుకున్నారా? లేకపోతే ఇలా సెట్ చేసుకోండి.

సెట్ చేసుకోవడం ఎలా?

ఇది చాల సులభం

1. ముందుగా మీ సెట్టింగ్ కు వెళ్ళండి

2. అందులో Wi-fi కాలింగ్ కోసం వెతకండి

3. ఇక చివరిగా Wi-Fi కాలింగ్ ఎనేబుల్ చేయండి.

చూశారుగా ఇది చాలా సులభం. అయితే, నిరంతరాయంగా కాలింగ్ చెయ్యడానికి ఈ WiFI కాలింగ్ తో పాటుగా VoLTE ని స్విచ్ ఆన్ చేసి ఉంచాలి.   

అయితే, మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కూడా కొన్ని వున్నాయి. అవేమిటంటే, మీరు ఈ ఉచిత కాలింగ్ కోసం ఎటువంటి లేదా ఏ Wi-Fi సర్విసునైనా వాడుకోవచ్చు. దీనితో కాలింగ్ చేసేప్పుడు కాల్స్ చాల స్పష్టంగా మరియు నిలకడగా ఉంటాయి. అధనంగా, వీడియో కాలింగ్ నిజంగా మంచి అనుభూతిని అందిస్తుంది. ఇక ప్రధాన విషయం ఏమిటంటే, ఈ Wi-Fi కాలింగ్ చేయడనికి మీ వద్ద Wifi కాలింగ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్ ఫోన్ మరియు జియో యొక్క ఏదైనా టారిఫ్ ప్లాన్ కి యాక్టివ్ చేసి ఉండాలి. అయితే, ఈ Wi-Fi కాలింగ్ కలిగిన స్మార్ట్ ఫోన్ల జాబితాలో ఈ ఫోన్ ఉందొ లేదో తెలుసుకోవాలంటే, ఇక్కడ CHECK చేసుకోండి  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo