Jio 5G Upgrade Plan: ఈ కొత్త ప్లాన్ తో అన్లిమిటెడ్ 5G డేటా అఫర్ చేస్తోంది.!
జియో ఇప్పటికే చాలా నగరాల్లో తన 5G సేవలను ప్రకటించింది
4G సిమ్ కార్డ్ పైన 5G సర్వీసులను అందుకోవచ్చ
రిలయన్స్ జియో కొత్త Jio 5G Upgrade Plan ను యూజర్ల కోసం అందించింది
రిలయన్స్ జియో ఇప్పటికే చాలా నగరాల్లో తన 5G సేవలను ప్రకటించింది. ఇటీవలే, తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా నాగరాల్లో తన 5G సర్వీస్ లను అందించింది. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న 4G సిమ్ కార్డ్ పైన నిర్విఘ్నంగా 5G సర్వీసులను అందుకోవచ్చని కూడా జియో తెలిపింది. అంతేకాదు, ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్స్ పైనే 5G సేవలను ఉపయోగించుకోవచ్చని కూడా పేర్కొంది. అయితే, ఇటీవలే, రిలయన్స్ జియో కొత్త Jio 5G Upgrade Plan ను యూజర్ల కోసం అందించింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 5G స్పీడ్ తో డేటాని పొందవచ్చు. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు మరియు ఏ ప్లాన్ లతో పాటుగా ఈ 5G అప్గ్రేడ్ ప్లాన్ వర్తిస్తుందో తెలుసుకోండి.
SurveyJio 5G Upgrade Plan:
జియో ప్రకారం, ఈ జియో 5G అప్గ్రేడ్ ప్లాన్ కేవలం రూ.61 రూపాయలకే లభిస్తుంది. ఈ పాన్ తో మీకు 6GB అన్లిమిటెడ్ 5G డేటా అందుతుంది. ఈ డేటా ఎటువంటి ఉపయోగానికి లిమిట్ లేదు. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ కాలం వరకూ ఈ డేటాని ఉపయోగించుకోవచ్చు. లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఇది ఏ ప్రాంతాల్లో అయితే Jio 5G సర్వీస్ అందుబాటులో ఉన్నదో వారికీ మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఇప్పటి వరకూ True Jio 5G లాంచ్ చేయబడిందో, ఆ సిటీలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ జియో 5G అప్గ్రేడ్ ప్లాన్ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే యాడ్ ఆన్ గా జతచేసే వీలుంది. జియో తెలిపిన ప్రకారం, రూ.119, రూ.149, రూ.179, రూ.199 మరియు రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే ఈ జియో Jio 5G Upgrade Plan యాడ్ ఆన్ గా రీచార్జ్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile