Jio 5G : కేవలం రూ. 15 రూపాయలకే Unlimited 5G డేటా ఆఫర్ తెచ్చిన జియో.!

Highlights

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో కొత్త డేటా ప్యాక్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది

జియో కొత్తగా ప్రకటించిన రూ.15 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్ 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా అందిస్తుంది

ఒక్కరోజు కోసం చవక ధరలో అన్లిమిటెడ్ డేటా కోరుకునే వారికి ఈ కొత్త డేటా ప్లాన్ గొప్ప వరం

Jio 5G : దేశీయ టెలికాం రంగంలో అత్యధికంగా యూజర్లను కలిగిన సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో కొత్త డేటా ప్యాక్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే జియో కొత్తగా ప్రకటించిన రూ.15 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్. ఈ అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్ తో ఏకంగా 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక్కరోజు కోసం చవక ధరలో అన్లిమిటెడ్ డేటా కోరుకునే వారికి ఈ కొత్త డేటా ప్లాన్ గొప్ప వరం అవుతుంది.

Jio 5G : రూ. 15 Unlimited 5G ప్లాన్

రిలియన్స్ జియో కొత్తగా అందించిన రూ. 15 రూపాయల డేటా ప్లాన్, ఎక్కువ మొత్తంలో ఇంటర్నెట్ అవసరమయ్యే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో స్ట్రీమింగ్, ఆన్‌ లైన్ గేమింగ్, భారీ ఫైల్స్ డౌన్‌ లోడ్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అవసరాలకు ఈ బడ్జెట్ అన్లిమిటెడ్ డేటా ప్యాక్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ తో వచ్చే బెనిఫిట్స్ చూస్తే, ఈ డేటా ప్లాన్ తో ఒకరోజు మొత్తం జియో ట్రూ 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా ఉపయోగించుకోవచ్చు. అలాగే, 4జి నెట్ వర్క్ పైన కూడా 200MB హై స్పీడ్ డేటా అందిస్తుంది.

జియో ఇప్పటికే చాలా బడ్జెట్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ లను కూడా అందించింది. రీసెంట్ గా 4జి యూజర్ల జియో అందించిన రూ. 11 డేటా ప్యాక్‌ తో ఇందులో మొదటిది. ఈ బడ్జెట్ డేటా పోలిస్తే ఇందులో కొత్త రూ. 15 డేటా ప్లాన్ ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి? ఈ రెండు రీఛార్జ్‌ ప్లాన్ లలో ఏది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం.

Jio 5G : రూ. 15 అన్లిమిటెడ్ 5జి డేటా ప్లాన్

రూ. 15 అన్లిమిటెడ్ 5జి డేటా ప్లాన్ అనేది జియో కొత్తగా తీసుకొచ్చిన రూ.15 డేటా ప్యాక్‌ మరియు ఇది 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసిన యూజర్లకు ఒక రోజు పాటు భారీ మొత్తంలో డేటాను ఉపయోగించుకునే అవకాశం అందిస్తుంది. ముఖ్యంగా 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ ఫోన్ మరియు జియో True 5G నెట్‌ వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

జియో రూ.11 డేటా ప్లాన్ బెనిఫిట్స్

మరోవైపు జియో రూ.11 డేటా ప్యాక్ కూడా తక్కువ ధరలో అదనపు డేటా కోరుకునే వారికి అందుబాటులో ఉంది. ఈ బడ్జెట్ డేటా ప్లాన్ తో రీఛార్జ్‌ చేసే యూజర్లకు 10GB డేటా లభిస్తుంది. అయితే, దీని వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే రీఛార్జ్ చేసిన తర్వాత గంటలోపు 10GB డేటాను వినియోగించుకోవాలి. పెద్ద ఫైల్స్ డౌన్‌ లోడ్ చేయడానికి, తక్కువ సమయంలో ఎక్కువ డేటా అవసరమైనప్పుడు ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది.

ఈ రెండు ప్లాన్స్ లో ఏది బెటర్?

కేవలం రూ.4 అదనంగా చెల్లించడం ద్వారా ఎక్కువ సమయం అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి రూ. 15 రూపాయల డేటా ప్లాన్ బెస్ట్ అని చెబుతాను. అయితే, 5G స్మార్ట్‌ ఫోన్ మరియు జియో 5G నెట్‌వర్క్ ఉన్నవారికి మాత్రమే రూ.15 ప్యాక్ మెరుగైన ఎంపికగా అని చెప్పవచ్చు. అయితే, 4G వినియోగదారులు రూ.15 ప్యాక్‌ లో అన్‌లిమిటెడ్ 5G ప్రయోజనాన్ని పొందలేరు. కాబట్టి, రీఛార్జ్‌ కు ముందు MyJio యాప్‌ లో మీ నంబర్‌ కు వర్తించే ప్రయోజనాలు మరియు నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile