Jio 5G: తెలుగు రాష్ట్రాల్లోని మరో 7 ప్రాంతాల్లో 5G నెట్ వర్క్ షురూ.!
రిలయన్స్ జియో తెలుగురాష్ట్రల్లో చాలా వేగంగా తన నెట్ వర్క్ ను విస్తరిస్తోంది
Jio మరొక 7 ప్రాంతాల్లో 5G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది
ఈ ప్రాంతాలలోని జియో కస్టమర్లు ఇప్పుడు వేగవతమైన Jio 5G సర్వీస్ ను ఆనందించవచ్చు
Jio 5G: రిలయన్స్ జియో తెలుగురాష్ట్రల్లో చాలా వేగంగా తన నెట్ వర్క్ ను విస్తరిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తన 5G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన రిలయన్స్ జియో, ఇప్పుడు మరొక 7 ప్రాంతాల్లో 5G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రిలయన్స్ జియో 5G నెట్ వర్క్ ను కొత్తగా జత చేసిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నగరాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని 1 నగరం వుంది.
Surveyఇక లేటెస్ట్ 5G నెట్ వర్క్ అందుకున్న సిటీల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం, ధర్మవరం, కావలి,తణుకు, తుని మరియు వినుకొండ సిటీలో జియో 5G సేవలు మొదలయ్యాయి. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట సిటీలో కూడా Jio True 5G సర్వీస్ లు మొదలయ్యాయి. ఈ ప్రాంతాలలోని జియో కస్టమర్లు ఇప్పుడు వేగవతమైన Jio 5G సర్వీస్ ను ఆనందించవచ్చు, అదీకూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.
ఈ నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందుతారని కూడా జియో వెల్లడించింది. దీనికోసం My Jio App నుండి 5G ఎనేబుల్ కోసం అధ్యర్ధన నమోదు చెయ్యవలసి ఉంటుంది.
మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile