డైలీ 1.5GB హై స్పీడ్ డేటాతో అదరగొడుతున్న జియో కొత్త ప్లాన్స్

డైలీ 1.5GB హై స్పీడ్ డేటాతో అదరగొడుతున్న జియో కొత్త ప్లాన్స్
HIGHLIGHTS

చాలా తక్కువ ధర వద్ద ఎక్కువ రోజువారీ డేటాను పొందుతారు.

ప్రస్తుతం జియో యొక్క ప్లాన్ల ధరలు మరింతగా పెరిగిన తర్వాత కూడా జియో వినియోగదారులకు చాలా మంచి డేటా ప్లాన్లలను అందిస్తోంది. అన్ని రకాల ప్లాన్లు  ప్రస్తుతం కంపెనీ యొక్క పోర్ట్‌ ఫోలియోలో ఉన్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా ఉత్తమ రీఛార్జిని ఎంచుకోవచ్చు. వీడియో స్ట్రీమింగ్ యాప్స్  మరియు ఆన్‌లైన్ కంటెంట్ రావడంతో రోజువారీ డేటా వినియోగం మరింతగా పెరిగింది. అందువల్ల వినియోగదారులు ఇప్పుడు అటువంటి ప్లాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ ప్లాన్లతో, వారు చాలా తక్కువ ధర వద్ద ఎక్కువ రోజువారీ డేటాను పొందుతారు.

1. Rs. 199 ప్లాన్‌

ఈ 199 ప్లాన్‌ లో, జియో ప్రతిరోజూ 1.5 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్  28 రోజుల చెల్లుబాటుతో జియో నెట్‌వర్క్‌ కి అన్లిమిటెడ్ ఉచిత కాలింగ్‌ను అందిస్తుంది. ఇక ఇతర నెట్‌వర్క్‌ల విషయానికి వస్తే, 1000 నిమిషాల కాలింగ్ మినిట్స్ అందిస్తుంది. దీనితో పాటుగా, డైలీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు మరియు జియో యాప్‌కు ఉచిత యాక్సెస్ ను కూడా అందుకుంటారు.

2. Rs. 399 ప్లాన్‌

ఈ 399 ప్లాన్‌ లో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను కంపెనీ అందిస్తోంది. 56 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ జియో-టు-జియో అపరిమిత ఉచిత కాల్స్ ను అందిస్తుంది.  అలాగే, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి మీకు 2000 ఉచిత నిమిషాలు ఇస్తుంది. ఉచిత నిమిషాలు గడిచిన తర్వాత కాల్ చేయడానికి టాక్-టైమ్ రీఛార్జ్ చేయవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనం ఏమిటంటే, వినియోగదారులు జియో సావన్, జియో సినిమా వంటి అనేక జియో యాప్స్ కు  సభ్యత్వాన్ని పొందవచ్చు.

3. Rs. 555 ప్లాన్‌

జియో యొక్క 555 ప్లాన్‌లో ప్రతిరోజూ 1.5 GB తో మొత్తం 126 జిబి డేటా లభిస్తుంది. అలాగే,  జియో నంబర్లకు అపరిమిత ఉచిత కాల్ మరియు  ఇతర నెట్‌ వర్క్‌ల కోసం  పూర్తి వ్యాలిడిటీ గాను 3000 నిమిషాలు టాక్ టైం తో వస్తుంది. ఇది 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు  డైలీ 100 ఉచిత ఎస్ఎంఎస్ మరియు రోజువారీ లైవ్ యాప్స్ కు కూడా ఉచిత చందాతో లభిస్తుంది.

4. Rs. 2020

జియో నుండి వచ్చిన ఈ 2020 ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లానుతో ప్రతి రోజు 100 ఉచిత ఎస్ఎంఎస్ మరియు 1.5 జిబి డేటాను అందిస్తోంది. ఇతర ప్లాన్స్ మాదిరిగానే, కంపెనీ జియో నెట్‌వర్క్‌లకు అపరిమిత ఉచిత కాల్స్ ను ఇస్తోంది. అదే సమయంలో, ఇతర నెట్‌వర్క్‌ల కోసం 12000 నిమిషాల టాక్ టైం కూడా ఆఫర్ల చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo