మంచి నిర్ణయం తీసుకున్న సన్ డైరెక్ట్ మరియు టాటా స్కై

మంచి నిర్ణయం తీసుకున్న సన్ డైరెక్ట్ మరియు టాటా స్కై
HIGHLIGHTS

Sun Direct, ఫ్రీ -టూ-ఎయిర్ (FTA) ఛానళ్ల కోసం NCF (నెట్వర్క్ కెపాసిటీ ఫీ) ని తొలగించింది. టాటా స్కై ఈ ఫీజును పాక్షికంగా తగ్గించింది.

DTH మరియు కేబుల్ ఆపరేటర్లు  చానళ్లను విడిగా ఎంచుకోలేని చందాదారులకు ఉపయోగపడే విధంగా ఒక "బెస్ట్ ఫిట్ ప్లాన్" సిద్ధం చేయాలనీ మరియు అప్పటి వరకు వారికి నచ్చిన పాత ప్లాన్లలో ఎటువంటి మార్పులు లేకుండా అందించాలని ఆదేశించిన విషయం అందరికి విదితమే. ఇవన్నీ జరగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, ఈ గడువును 2019 మార్చి 31 వ తేదీ వరకు పొడిగించింది. ఈ తేదీ లోపుగా చందాదారులకు సరైన అవగాహన కల్పించాలని కూడా TRAI తెలిపింది.

అయితే, ఇప్పుడు సన్ డైరెక్ట్ మరియు టాటా స్కై వాటి వినియోగదారులకి, TRAI ఆదేశాలను ఆచరణ పెట్టడంలో ముందువరుసలో నిలచనై చెప్పొచ్చు.  సన్ డైరెక్ట్ మరియు టాటా స్కై రెండు కూడా, ఫ్రీ -టూ-ఎయిర్ (FTA) ఛానళ్ల కోసం చెల్లించాల్సిన NCF (నెట్వర్క్ కెపాసిటీ ఫీ) లో గణనీయమైన మార్పులను చేశాయి. అయితే, Sun Direct తన ఫ్రీ -టూ-ఎయిర్ (FTA) ఛానళ్ల కోసం NCF (నెట్వర్క్ కెపాసిటీ ఫీ) ని పూర్తిగా తొలగించగా, టాటా స్కై మాత్రం ఈ ఫీజును పాక్షికంగా తగ్గించింది.

వాస్తవానికి, ముందుగా 100 FTA చానళ్ల బేస్ ప్యాక్ కోసం 130 రూపాయలను చెల్లించేలా DTH ఆపరేటర్లు నిర్ణయించారు. అయితే, ఇందులో ట్యాక్స్ లేదు ఈ మొత్తానికి ట్యాక్స్ కూడా కలిపితే దాదాపుగా 153 రూపాయల వరకూ అవుతుంది. ఈ 130 రూపాయల బేస్ ప్యాక్ లో కంటెంట్ ఫిజు మరియు  NCF కూడా కలిపి ఉంటుంది. కానీ, అదనపు 25 FTA ఛానళ్లను పొందడానికి 20 రూపాయల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు సన్ డైరెక్ట్ వినియోగదారుల కోసం ఈ NCF ఫీజును పూర్తిగా తొలగించింది. అలాగే, టాటా స్కై తన వినియోగదారులకు ఈ ఫీజును పాక్షికంగా తగ్గించింది.

ఇక సన్ డైరెక్ట్ ఆఫర్ల విషయానికి వస్తే, జెమినీ, ఈటీవీ మరియు maa టీవీ ల యొక్క అన్ని ఛానళ్లతో పాటుగా మరికొన్ని ముఖ్యమైన తెలుగుచన్లతో కలిపి 192 చానళ్లకు గాను Telugu DPO pack 1 ద్వారా కేవలం రూ. 179.66 (18%GST అదనం) తో అందిస్తోంది. అలాగే పైన తెలిపిన ముఖ్యమైన చానళ్లతో కలిపి 210 చానళ్లను Telugu DPO pack 2 ద్వారా కేవలం రూ. 230.5 (18%GST అదనం) తో అందిస్తోంది.                                

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo