DishTV వినియోగదారులకు శుభవార్త : సరికొత్త బెస్ట్ అఫర్ ప్లాన్స్ విడుదల

DishTV వినియోగదారులకు శుభవార్త : సరికొత్త బెస్ట్ అఫర్ ప్లాన్స్ విడుదల
HIGHLIGHTS

TRAI యొక్క కొత్త నిబంధనల తరువాత నిర్ణయించిన ధరలు .

మీరు కూడా DishTV  వాడుతున్నారా? యూజర్ అయితే మీ కోసం ఒక శుభవార్త. ఇటీవల డిష్ టీవీ తన వినియోగదారుల కోసం పండుగ ప్లాన్ ను అందించింది. ఈ కొత్త ఆఫర్ ప్లాన్ కింద, కంపెనీ వినియోగదారులకు కొత్త ఛానల్ ప్యాక్‌లను అందిస్తుంది, అయితే ధర మాత్రమే చెల్లించాలి. ఇవి TRAI యొక్క కొత్త నిబంధనల తరువాత నిర్ణయించిన ధరలు .

డిష్ టీవీ యొక్క కొత్త ఆఫర్ గురించి పరిశీలిస్తే, వినియోగదారులు రెండు సంవత్సరాలకు గాను ఒకేసారి ఛానల్ ప్యాక్‌కు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత, వినియోగదారులు ఈ ప్లాన్ను సద్వినియోగం చేసుకోవచ్చు మరియు తక్కువ ధరతో ఏదైనా ఛానెల్ ప్యాక్‌ని ఎంచుకోవచ్చు. ఈ ఛానెల్ ప్యాక్‌లలో 250 కి పైగా ఛానెల్‌లు ఇవ్వబడ్డాయి. సంస్థ వినియోగదారుల కోసం కొన్ని ప్రత్యేక ఛానెల్‌లను అందించింది.

కంపెనీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ SD ప్యాక్ యొక్క రూ .5,256 విలువగల ప్లాన్ 24 నెలల చెల్లుబాటుతో వస్తుంది. ఈ విధంగా, వినియోగదారులు నెలవారీ ధర ను చూస్తే  కేవలం 219 రూపాయలు మాత్రమే అవుతుంది. దీనితో పాటు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ HD ప్యాక్ యొక్క 24 నెలల ధర రూ .7,176 మరియు ఇది నెలవారీగా చూస్తే ధర కేవలం రూ .299 మాత్రమే అవుతుంది.

ఫ్యామిలీ ఇంగ్లీష్ SD ప్యాక్ యొక్క 24 నెలల ప్యాక్ ధర రూ .7,800. అదే సమయంలో, దాని నెలవారీ ధర రూ .352 గా ఉంటుంది. అలాగే, HD ప్యాక్ యొక్క 24 నెలల ప్లాన్ ధర రూ .10,776 కాగా, నెలవారీ ధర రూ .449 గా ఉంటుంది. ఫ్యామిలీ క్రికెట్ ప్యాక్ SD ప్యాక్ రెండేళ్ల ధర రూ .6,600 కాగా, నెలవారీ ధర రూ .275. దీని HD ప్యాక్ ధర రూ .8,376, నెలవారీ యూజర్ రూ .349 చెల్లించాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo