get Jio Hotstar free subscription with this jio prepaid plan
Jio Hotstar OTT సర్వీస్ ను రిలయన్స్ జియో కొత్తగా ప్రారంభించింది. గత సంవత్సరం నుంచి జియో హాట్ స్టార్ గురించి వార్తలు వస్తున్నా, ఎట్టకేలకు 2025 ఫిబ్రవరిలో ఈ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సర్వీస్ ను జియో యొక్క ఒక ప్రీపెయిడ్ ప్లాన్ తో ఉచితంగా ఆఫర్ చేస్తోంది. మీరు కూడా జియో హాట్ స్టార్ సర్వీస్ లను ఉచితంగా పొందాలనుకుంటే ఈ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది.
జియో యొక్క రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో హాట్ స్టార్ ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ మాత్రమే కాదు చాలా అన్లిమిటెడ్ బెనిఫిట్స్ మరియు మరిన్ని ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇక్కడ చూడవచ్చు.
జియో యొక్క ఈ రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 84 రోజులు జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా అందుకోవచ్చు. ఇది కాకుండా డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందుకుంటారు. అలాగే, 4G నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా చొప్పున 84 రోజులకు 168 GB డేటా కూడా అందిస్తుంది.
ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో మూడు నెలల (90 రోజులు) జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Also Read: Vivo T4x 5G: వివో అప్ కమింగ్ బడ్జెట్ ఫోన్ టీజింగ్ మొదలుపెట్టింది.!
మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here