BSNL యొక్క IPL ధమాఖా ప్లాన్స్

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ తన అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ విషయం గురించిన ప్రకటన చేసింది.

రూ. 199 తో రీఛార్జ్ చేస్తే, మీకు 28 రోజుల చెల్లుబాటు పొందుతారు

కాలర్ ట్యూనుగా తాజా క్రికెట్ స్కోరును సెట్ చేయవచ్చు

BSNL యొక్క IPL ధమాఖా ప్లాన్స్

ఇతర ప్రైవేట్ టెలికం ప్రత్యర్ధుల నుండి వచ్చే పోటీని తిప్పికొట్టే లక్ష్యంగా, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) రెండు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు స్పెషల్ టారిఫ్ వోచర్లు (STV) 199 రూపాయల (నార్త్ రూ. 201), 499 రూపాయల విలువతో ఉంటాయి. భారతదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) T20 టోర్నమెంట్ సందర్భంగా, వినియోగదారులకు కంపెనీ తన ప్లాన్లతో ప్రోత్సహిస్తోంది. అంతేకాదు, కాలర్ ట్యూనుగా తాజా క్రికెట్ స్కోరును సెట్ చేయవచ్చు కూడాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బిఎస్ఎన్ఎల్ తన అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ విషయం గురించిన  ప్రకటన చేసింది. రూ. 199, రూ. 499 ప్లాన్లతో, అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ వాయిస్ కాలింగ్ అందిస్తున్నాయి. ముంబై, ఢిల్లీ వంటి సర్కిళ్లకు కూడా, అపరిమిత వాయిస్ కాలింగ్ రోమింగ్ తో పాటుగా చెల్లుతుంది. ఎందుకంటే ఈ నగరాల్లో BSNL కార్యకలాపాలు లేవు. ఈ STV తో రోజువారీ 1GB డేటా మరియు 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, రూ. 199 తో రీఛార్జ్ చేస్తే, మీకు 28 రోజుల చెల్లుబాటు పొందుతారు మరియు మీరు 499 తో రీఛార్జ్ చేస్తే, ఈ ప్లానుతో 90 రోజుల వ్యాలిడిటీని అందుకుంటారు.

గత నెల, BSNL ఒక కొత్త WiFi హాట్ స్పాట్ టారిఫ్ వోచర్లను ప్రకటించింది, వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న ఈ తేలికో యొక్క 'WiFi హాట్ స్పాట్లను యాక్సెస్ చేయడానికి దీనితో వీలు కల్పించారు. ఈ తేలికో దేశంలో 38,000  Wi-Fi హాట్ స్పాట్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తంగా కంపెనీ నాలుగు వోచర్లను ప్రకటించింది. ఇందులో, రూ.19 వోచారుతో 2 జిబి డేటా, రెడురోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. అలాగే,  రూ. 39 మరియు రూ. 59 వోచర్లు ఉన్నాయి, ఇవి ఏడు మరియు 15 రోజులు వరుసగా 7GB మరియు 15GB డేటాతో వస్తాయి. ఇక చివరిగా, 69 రూపాయల వోచారుతో, 30 జిబి డేటా లభిస్తుంది, ఇది పూర్తిగా నెలకు చెల్లుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo