BSNL VoWiFi: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నెట్ వర్క్ సమస్య ఉండదు.!

HIGHLIGHTS

4G నెట్ వర్క్ విస్తరించిన తర్వాత బిఎస్ఎన్ఎల్ యూజర్ బేస్ లో వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది

ఈ నెట్ వర్క్ లో ఉండే చిన్న గ్యాప్ ను కూడా నింపడానికి బిఎస్ఎన్ఎల్ కొత్తగా VoWiFi నెట్ వర్క్ ఫీచర్ తెచ్చింది

ఈ కొత్త ఫీచర్ ద్వారా వై-ఫై తో అంతరాయం లేని కాలింగ్ అందుతుంది

BSNL VoWiFi: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నెట్ వర్క్ సమస్య ఉండదు.!

BSNL VoWiFi: గతంలో నెట్ వర్క్ లేని కారణంగా బిఎస్ఎన్ఎల్ నుంచి అత్యధికంగా యూజర్లు వలస వెళ్ళినట్లు తెలిపారు. అయితే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు టాటా కమ్యూనికేషన్స్ సహకారంతో 4G నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించిన తర్వాత, బిఎస్ఎన్ఎల్ యూజర్ బేస్ లో వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. అయితే, ఈ నెట్ వర్క్ లో ఉండే చిన్న గ్యాప్ ను కూడా నింపడానికి బిఎస్ఎన్ఎల్ కొత్తగా లోకల్ నెట్ వర్క్ ఫీచర్ ను కూడా యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్ ను దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL VoWiFi: ఏమిటి ఈ ఫీచర్?

వాయిస్ ఓవర్ వై-ఫై ని సింపుల్ గా VoWiFi అని పిలుస్తారు. మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు లోకల్ నెట్ వర్క్, అంటే లోకల్ Wi-Fi తో ఇంటర్నెట్ ద్వారా కాల్ చేయడానికి మరియు స్వీకరించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అంటే, నెట్ వర్క్ సరిగ్గా లేనప్పుడు ఈ కొత్త ఫీచర్ ద్వారా వై-ఫై తో అంతరాయం లేని కాలింగ్ అందుతుంది.

BSNL VoWiFi

VoWiFi ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త ఫీచర్ ద్వారా మొబైల్ టవర్ సిగ్నల్ బదులు, మీ ఇంటి లేదా ఆఫీస్ వై-ఫై కనెక్షన్ తో కాల్ చేసుకోవచ్చు. ఇందులో, మీ నెంబర్ పై సాధారణ కాల్ చేసుకోవచ్చు. అంటే, ఇది వాట్సాప్ కాల్ మాదిరిగా ఉండదు అని చెబుతున్నాను. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీ ఫోన్ నెంబర్ తో ఎటువంటి కాల్ డ్రాప్ లేకుండా చక్కగా కాలింగ్ సౌకర్యాన్ని అందుకోవచ్చు.

ఈ ఫీచర్ తో ఉపయోగాలు ఏమిటి?

హిల్ స్టేషన్, బేస్‌మెంట్, బిల్డింగ్ మరియు ఎక్కువగా గృహ సముదాయాలు వంటి నెట్‌వర్క్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా క్లియర్ కాల్ క్వాలిటీ మీకు అందుతుంది. అంతేకాదు, నెట్‌వర్క్ తక్కువగా ఉండే సమయాల్లో బ్యాటరీ త్వరగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఈ కొత్త ఫీచర్ తో బ్యాటరీ సేవింగ్ కూడా అవుతుంది.

Also Read: Sony Smart Tv పై కొత్త సంవత్సరం బిగ్ డీల్ ప్రకటించిన అమెజాన్.!

ఈ ఫీచర్ పొందాలంటే ఏమికావాలి?

ఈ ఫీచర్ బిఎస్ఎన్ఎల్ యూజర్లు అందరికీ అందించింది. అయితే, ఈ ఫీచర్ పొందాలంటే VoWiFi సపోర్ట్ చేసే స్మార్ట్‌ ఫోన్ మీ వద్ద ఉండాలి. అంతేకాదు, మీరు యాక్టివ్ Wi-Fi కనెక్షన్ కలిగి ఉండాలి. ఇలా రెండు కలిగి ఉంటే, మీరు మీ ఫోన్ సెట్టింగ్స్‌లో Wi-Fi Calling ON చేయాలి. అంతే, మీ ఫోన్ లో ఇక నెట్ వర్క్ సమస్యలు లేని బిఎస్ఎన్ఎల్ కాలింగ్ మీకు అందుతుంది.

ఈ ఫీచర్ ను బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశం మొత్తం అందించింది. మీరు కూడా బిఎస్ఎన్ఎల్ యూజర్ అయితే ఒక నుంచి ప్లేస్ ఏదైనా నెట్ వర్క్ సమస్య ఉండదు. జస్ట్ వై-ఫై కాలింగ్ ఫీచర్ ఆన్ చేయండి, అంతరాయం లేని కాలింగ్ ఎంజాయ్ చేయండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo