BSNL Super Plan which offers unlimited benefits for a year
BSNL Super Plan: అతి చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు పొందాలంటే కచ్చితంగా ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీ గా ఉండొచ్చు. ముఖ్యంగా ఇది యూజర్ బడ్జెట్ ధరలోనే ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ సంవత్సర మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం యూజర్లు చేసే ఖర్చును 12 నెలలకు విభజిస్తే, నెలకు కేవలం రూ. 199 రూపాయలు మాత్రమే అవుతుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వచ్చే లాభాలు మాత్రం అనేకం. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల పాటు యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సంవత్సర కాలం పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ వేగవంతమైన డేటా మరియు డైలీ 100 SMS కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ [ప్లాన్ తో వచ్చే ఢిల్లీ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు జనవరి 31వ తేదీ లోపుగా ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 500MB అదనపు డేటా కూడా అందిస్తుంది. అంటే, ప్లాన్ తో డైలీ 2.5 జీబీ డేటా సంవత్సరం మొత్తం లభిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,399 ప్లాన్ ను ఫుల్ పైసా వసూల్ ప్లాన్ అని కూడా బిఎస్ఎన్ఎల్ చెబుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కాకుండా మరో ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఇదే లాభాలు 300 రోజులు అందిస్తుంది. ఈ ప్లాన్ ను కూడా మీరు పరిశీలించవచ్చు. ఈ ప్లాన్ నెలకు కేవలం రూ. 182 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అదే, రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ అందించే లాభాలు ఇప్పుడు చూద్దాం.
Also Read: Super Deal: కేవలం 10 వేల ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
బిఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ 330 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 330 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1.5 జీబీ హై స్పీడ్ డేటా మరియు 100 SMS వంటి లాభాలు అందుకుంటారు. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందుకుంటారు. అంటే, 330 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఈ ప్లాన్ తో మీరు అందుకోవచ్చు.