BSNL Rs.107 Plan: ఒక్కసారి రీఛార్జ్ చెయ్యండి 40 రోజులు ఆనందించండి.!

HIGHLIGHTS

BSNL తన వినియోగదారుకు చాలా తక్కువ ధరలో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తోంది

BSNL Rs.107 Plan మంచి ప్రయోజాలను అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది

ఈ రీఛార్జ్, కాలింగ్, డేటా మరియు మరిన్ని లాభాలతో వస్తుంది

BSNL Rs.107 Plan: ఒక్కసారి రీఛార్జ్ చెయ్యండి 40 రోజులు ఆనందించండి.!

BSNL తన వినియోగదారుకు చాలా తక్కువ ధరలో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తోంది. వాటిలో,  BSNL Rs.107 Plan మంచి ప్రయోజాలను అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 40 రోజులు అందించవచ్చు. ఈ రీఛార్జ్ ద్వారా కాలింగ్, డేటా మరియు మరిన్ని లాభాలతో వస్తుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు మరియు మరిన్ని బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL Rs.107 Plan: 

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో రూ.107 ప్లాన్ కూడా ఒకటి. ఈ ప్లాన్ కేవలం 107 రూపాయలకే 40 రోజుల వ్యాలిడిటీని మీకు అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 200 మినిట్స్ ఉచిత కాలింగ్ మినిట్స్ ను కూడా అందిస్తున్నది. అలాగే, 40 రోజుల ఉచిత BSNL ట్యూన్స్ ని కూడా మీరు పొందుతారు. అంతేకాదు, పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 3GB డేటా కూడా అందుతుంది. ఈ ఫ్రీ బైస్ ముగిసిన తరువాత మీకు కాల్ మరియు డేటా రేట్లు వర్తిస్తాయి. 

BSNL వినియోగదారులకు మరిన్ని లాభాలను తక్కువ ధరలో అందించే మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కూడా వున్నాయి. వాటిలో BSNL యొక్క రూ.249 మరియు రూ.397 ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.          

BSNL రూ.249:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఇది కేవలం వ్యాలిడిటీ మాత్రమే తీసుకువస్తుంది అని మాత్రం అనుకోకండి. ఈ ప్లాన్ తో డైలీ 2GB హాయ్ స్పీడ్ డేటా అందుతుంది మరియు ఎటువంటి రోమింగ్ లేకుండా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS లను కూడా మీరు ఈ ప్లాన్ తో పొందవచ్చు. డైలీ డేటా ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది.

BSNL రూ.397:

పైన తెలిపి అఫర్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా BSNL తన కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.  ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి 180 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo