BSNL New Year Offer announced with unlimited benefits at rs 1 only
BSNL New Year Offer: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ అందించింది. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం రూ. 1 రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అంటే, కేవలం ఒక రూపాయకే కాలింగ్ మరియు డేటా వంటి అన్ని ప్రయోజనాలు కూడా యూజర్లు అందుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ గొప్ప ఆఫర్ వివరాలు మరింత వివరంగా తెలుసుకోండి.
బిఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ అందించింది. అదేమిటంటే, 2025 డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉన్న రూ. 1 ఆఫర్ ప్లాన్ ను కొత్త సంవత్సరంలో కూడా అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది. అయితే, ఈసారి కూడా కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని షరతు పెట్టింది. అంటే, ఇప్పుడు కూడా ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఏంటి ఇంకా అర్ధం కాలేదా? అదేనండి బిఎస్ఎన్ఎల్ అందించిన 1 రూపాయి ఫ్రీడమ్ ఆఫర్ ఇప్పుడు 2026 జనవరి 31 వరకు లిమిటెడ్ పీరియడ్ టైమ్ కోసం మరోసారి వచ్చింది. ఈ సమయం లోపు బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తీసుకునే యూజర్లు మొదటి నెల రీఛార్జ్ ప్లాన్ గా రూ. 1 రూపాయి ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్ తో ఉచిత సిమ్ కార్డు తో పాటు కేవలం ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు పొందవచ్చు.
Also Read: Redmi Pad 2 Pro ఇండియన్ వేరియంట్ ప్రైస్ లీక్ అయ్యింది.. ధర ఎంతంటే.!
బిఎస్ఎన్ఎల్ యొక్క ఒక్క రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మీకు 30 రోజుల అన్లిమిటెడ్ లాభాలు లభిస్తాయి. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB వేగవంతమైన డేటా మరియు రోజుకు 100 SMS సెండింగ్ వంటి కంప్లీట్ ప్రయోజనాలు మీకు ఆఫర్ చేస్తుంది. అది కూడా కేవలం ఒక్క రూపాయి ఖర్చుతోనే ఈ అన్ని లాభాలు మీరు అందుకోవచ్చు.
పైన ముందే తెలియ చేసినట్లు ఈ ఆఫర్ కేవలం కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకునే యూజర్లకు మాత్రమే లభిస్తుంది. మీరు కూడా బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తీసుకుని ఫస్ట్ రీఛార్జ్ కోసం ఈ రూపాయి ఆఫర్ ఎంచుకుంటే ఈ ఆఫర్ మీకు లభిస్తుంది.