BSNL new rs 1 unlimited prepaid plan offer closes in five days
BSNL కొత్త అందించిన రూ. 1 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ మరో 5 రోజుల్లో ముగుస్తుంది. కొత్త యూజర్‌లను ఆకర్షించే విధంగా బీఎస్ఎన్ఎల్ ఇటీవల తీసుకొచ్చిన రూ. 1 అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ ఈ నెల 15 వ తేదీతో ముగుస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే కేవలం ఒక్క రూపాయికే నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. టెలికాం ఇండస్ట్రీ మొత్తం మీద ఇలాంటి ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ గా బీఎస్ఎన్ఎల్ నిలుస్తుంది. అందుకే, ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ముగిసేలోపు ఈ ప్లాన్ ను అందుకోండి.
బీఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను 2025 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ప్లాన్ గడువు తేదీ పెంచుకుంటూ వస్తోంది. ముందు కేవలం ఆగస్టు నెల కోసం మాత్రమే ఈ ప్లాన్ అందించిన బీఎస్ఎన్ఎల్, ఈ ఆఫర్ గడువు పెంచుకుంటూ వచ్చింది. అయితే, ఈ ఆఫర్ ఇప్పుడు నవంబర్ 15వ తేదీ తో ముగుస్తుందని వెల్లడించింది.
బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ను కేవలం కొత్త యూజర్ల కోసం మాత్రమే అందించింది. అంటే, బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తో చేసే ఫస్ట్ రీఛార్జ్ పై ఈ ఆఫర్ ని అందిస్తుంది. అంతేకాదు, బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకునే యూజర్లకు సిమ్ కార్డ్ కూడా ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్ తో రీచార్జ్ చేసే కొత్త యూజర్లు నెల రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు.
Also Read: Flipkart బిగ్ డిస్కౌంట్ తో 50 ఇంచ్ QLED Smart Tv కేవలం 21 వేలకే లభిస్తోంది.!
బీఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు 30 రోజులు రోజుకు 100 SMS వినియోగ వంటి ప్రయోజనాలు అందిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాలు కూడా కేవలం ఒక్క రూపాయికే అందుకోవచ్చు.
అంతేకాదు, ఈ ప్లాన్ ముగిసిన తర్వాత కూడా తక్కువ రేటుకే మంచి ప్లాన్ తో ఈ నెంబర్ ను కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే, అతి తక్కువ ధరలో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లు బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, త్వరలోనే 5G నెట్వర్క్ అందించే దిశగా బీఎస్ఎన్ఎల్ పరుగులు తీస్తోంది.