ఇతర టెలికామ్ సంస్థలకు గట్టి పోటీనిచ్చిన, BSNL అత్యుత్తమ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్స్

HIGHLIGHTS

దీపావళి కానుకగా తెచ్చిన Rs 1699 మరియు Rs 2099 ఇప్పుడు ఇతర టెలికామ్ సంస్థలకి గొట్టిపోటిగా నిలిచాయి.

ఇతర టెలికామ్ సంస్థలకు గట్టి పోటీనిచ్చిన, BSNL అత్యుత్తమ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్రభుత్వ టెలికామ్ సంస్థ అయినటువంటి, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) జియో యొక్క దీపావళి అఫర్ అయినటువంటి Rs 1699 ప్రీపెయిడ్ వార్షిక ప్రణాళికకు పోటీగా, ఈ దీపావళికి కోసం రెండు కొత్త వార్షిక ప్లాన్లను ప్రకటించింది.ఈ రెండు ప్లాన్లు కూడా వరుసగా Rs. 1699 మరియు Rs. 2099 ధరలతో ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా,  జియో యొక్క దీపావళి పండుగ ప్రీపెయిడ్ అఫర్ Rs. 1699 ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారి 1.5 GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 547GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందించింది. అయితే, ఈ ప్రణాళికకు పోటీగా  BSNL  కొత్త Rs.1699 ప్లాన్ తో, లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, రోజువారీ 100SMS లు మరియు రోజువారీ 2GB డాటాతో మొత్తంగా 730GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క FUP పరిమితిని దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది.  

BSNLAAA.jpg

 మరొక Rs. 2099 ప్రీపెయిడ్ ప్రణాళికతో,  లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, డైలీ 100SMS పరిమితి మరియు రోజువారీ 4GB డాటాతో మొత్తంగా 1460GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. దీని యొక్క FUP పరిమితి దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. ఈ రెండు కొత్త వార్షిక ప్లాన్స్ కూడా, భారతదేశమంతటా అందుబాటులోకి తెచ్చింది BSNL.             

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo