రూ.19 ఖర్చులో 90 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేసే ప్లాన్ గురించి మీకు తెలుసా.!

HIGHLIGHTS

దేశంలో అత్యంత చవక ధరలో లభించే లాంగ్ వ్యాలిటీ ప్లాన్

రూ.19 ఖర్చులో 90 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేసే ప్లాన్

ఈ ప్లాన్ ను అందిస్తోంది మరెవరో కాదు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ BSNL.

రూ.19 ఖర్చులో 90 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేసే ప్లాన్ గురించి మీకు తెలుసా.!

రూ.19 ఖర్చులో 90 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేసే ప్లాన్ గురించి మీకు తెలుసా? ఈ ప్లాన్ దేశంలో అత్యంత చవక ధరలో లభించే లాంగ్ వ్యాలిటీ ప్లాన్ గా కూడా చెప్పబడుతుంది. ఈ ప్లాన్ ను అందిస్తోంది మరెవరో కాదు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ BSNL. ఈ ప్లాన్ తో కేవలం 19 రూపాయలకే 90 రోజులు వ్యాలిడిటీ అందుకోవచ్చు. బ్యాడ్ లక్ ఏమిటంటే, BSNL యొక్క ఈ అద్భుతమైన ప్లాన్ కేవలం కొన్ని  సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో వుంది. ఈ ప్లాన్ దేశం అంతటా అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగించే విషయం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మనం మాట్లాడుతున్న ఈ 19 రూపాయల BSNL ప్లాన్ కేవలం ఒక్క సర్కిల్ లో మాత్రమే ఈ ప్లాన్ చెల్లుబాటులో వుంది. దేశంలో అత్యంత చవకైన ఈ ప్లాన్ ఏ సర్కిల్ మరియు రాష్ట్రాలలో చెలామణి అవుతోంది, ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.

BSNL రూ.19 ప్లాన్:

BSNL రూ.19 ప్లాన్ పూర్తిగా 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ తో 20 నిముషాల వాయిస్ కాలింగ్ మినిట్స్ కూడా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అఫర్ చేస్తోంది. అయితే, ఈ వాయిస్ కాలింగ్ మినిట్స్ ను 30 రోజుల వ్యవధిలోనే ఉపయోగించుకోవలసి ఉంటుంది. BSNL ఈ ప్లాన్ ను వ్యాలిడిటీ ఎక్స్ టెన్షన్ వోచర్ గా అందిస్తోంది. ఈ ప్లాన్ తో నిముషానికి కాల్ ఛార్జ్ లెక్కించ బడుతుంది.

ఇక ప్లాన్ చెల్లుబాటు అయ్యే సర్కిల్స్ విషయానికి వస్తే, BSNL యొక్క ఈ రూ.19 ప్లాన్ నార్త్ ఈస్ట్ సర్కిల్ పరిధిలో అందుబాటులో ఉంచింది. అంటే, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం , మేఘాలయా,  నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపుర రాష్ట్రాలలో ఈ అత్యంత చవకైన ప్లాన్ అందుబాటులో వుంది.

గమనిక: మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్లాన్ చెల్లుబాటులో లేదు. అయితే, దేశంలో అత్యంత చవకైన ప్లాన్ గురించి తెలియపరిచడం కోసమే ఈ ప్లాన్ గురించి చెప్పడం జరిగింది.       
 
మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo