BSNL కస్టమర్లకు ఇప్పుడు రూ.365 రీఛార్జిపై బెస్ట్ ఆఫర్ లభిస్తుంది. రూ .365 రూపాయల రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
Survey
✅ Thank you for completing the survey!
అయితే, ఇక్కడే ఒక మెళిక వుంది. అదేమిటంటే, ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తో , బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ మరియు 300 నెట్ నిమిషాలు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఎంట్రీ లెవల్ ప్లాన్ .ఈ ప్లాన్ ప్రకారం, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 25 జిబి వరకు డేటాను పొందుతారు.
రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్ .ఇవి కాకుండా, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 50 జిబి డేటా మరియు 75 జిబి వరకు డేటాను పొందుతారు.
రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
999 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్.ఇవి కాకుండా, బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు 225 జిబి డేటా లభిస్తుంది.