BSNL పబ్లిక్ Wi-Fi హాట్ స్పాట్ ప్లాన్లతో 30GB వరకూ హై స్పీడ్ డేటా అఫర్ చేస్తోంది

BSNL పబ్లిక్ Wi-Fi  హాట్ స్పాట్ ప్లాన్లతో 30GB వరకూ హై స్పీడ్ డేటా అఫర్ చేస్తోంది
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ నుండి వై-ఫై రిటైల్ హాట్ స్పాట్ వోచర్లు కేవలం 9 రూపాయల నుండి ప్రారంభమవుతాయి.

బిఎస్ఎన్ఎల్ కూడా పేటిఎం యాప్ ద్వారా యూజర్లు హై స్పీడ్ ఇంటర్నెట్ కి అనుమతిస్తుంది.

BSNL యొక్క పబ్లిక్ Wi-Fi హాట్ స్పాట్ వోచర్ 30GB డేటాను 30 రోజుల ప్రామాణికతతో అందిస్తుంది.

ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్ఎన్ఎల్ కొన్ని సంవత్సరాల క్రితం పబ్లిక్ Wi-Fi  హాట్ స్పాట్ సర్వీస్ ను ప్రారంభించింది. BSNL, భారతదేశం అంతటా  Wi-Fi  హాట్ స్పాట్లను విస్తరించడం కొనసాగించింది. ఇప్పుడు, BSNL ఈ సంఖ్యను 49,517 కు పెంచింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సర్వీస్ కోసం 31,836 స్థానాల్లో 50,000 వై-ఫై హాట్స్పాట్లు ఉన్నాయి  మరియు బిఎస్ఎన్ఎల్ నుండి వై-ఫై రిటైల్ హాట్ స్పాట్ వోచర్లు కేవలం 9 రూపాయల నుండి ప్రారంభమవుతాయి.

ప్రామాణిక పబ్లిక్ వై-ఫై హాట్ స్పాట్లతో పాటు, బిఎస్ఎన్ఎల్ కూడా కొన్ని చోట్ల పేటిఎం యాప్ ద్వారా యూజర్లు హై స్పీడ్ ఇంటర్నెట్ ను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. ముందుగా, బిఎస్ఎన్ఎల్ మరియు పేటిఎమ్ గత ఏడాది భాగస్వామ్యాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ నెట్వర్క్  యూజర్లు పేటిఎమ్ మొబైల్ యాప్ ద్వారా బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది. BSNL యొక్క పబ్లిక్ Wi-Fi  హాట్ స్పాట్ వోచర్ 30GB డేటాను 30 రోజుల ప్రామాణికతతో అందిస్తుంది.

BSNL పబ్లిక్ Wi-Fi  హాట్ స్పాట్ ప్లాన్స్ సమాచారం

బిఎస్ఎన్ఎల్ భారతదేశంలో ఐదు పబ్లిక్ వై-ఫై హాట్ స్పాట్ ప్లాన్లను అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ Wi-Fi హాట్ స్పాట్ ప్రారంభ ప్లాన్ 9 రూపాయలతో మొదలవుతుంది  మరియు ఒక రోజుకు 1 జిబి డేటాని అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ వై-ఫై 19 ప్లాన్ 19 రూపాయలకు రిటైల్ అవుతోంది మరియు ఇది మూడు రోజుల పాటు 3 జిబి డేటాతో వస్తుంది. బిఎస్ఎన్ఎల్ వై-ఫై 39, వై-ఫై 59 మరియు వై-ఫై 69 ప్లాన్లు 7 జిబి, 15 జిబి మరియు 30 జిబి డేటాను వరుసగా 7 రోజులు, 15 రోజులు మరియు 30 రోజులు వ్యాలిడిటీ అందిస్తాయి.

హాట్ స్పాట్ కి కనెక్ట్ అయిన తర్వాత బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ Wi-Fi హాట్ స్పాట్ ప్లాన్లకు సభ్యత్వాన్ని పొందవచ్చు లేదా రీఛార్జ్ చేయడానికి కంపెనీ మొబైల్ యాప్  లేదా వెబ్సైట్ ను కూడా సందర్శించవచ్చు.

BSNL పబ్లిక్ Wi-Fi  హాట్ స్పాట్ ను ఎలా కనెక్ట్ చేయాలి?

BSNL పబ్లిక్ Wi-Fi హాట్ స్పాట్లకు కనెక్ట్ చేయడం చాలా సులభం. మీరు BSNL Wi-Fi హాట్ స్పాట్ జోన్లోకి ప్రవేశించినప్పుడు మీ Android లేదా iOS స్మార్ట్ ఫోన్  కి నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ, Wi-Fi నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వండి మరియు BSNL మొబైల్ నంబర్ తో సబ్మిట్ చెయ్యండి. Wi-Fi హాట్ స్పాట ప్యాక్ ని యాక్సెస్   చేయండి లేదా ప్యాక్ కనెక్ట్ చేయండి మరియు సబ్ స్క్రైబ్  చేయండి.

పేటీఎం మొబైల్ యాప్ ద్వారా బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులను వై-ఫై నెట్వర్క్కు కనెక్ట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. Paytm యాప్ లోపల Wi-Fi విభాగానికి వెళ్లి, హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్రామాణీకరించడానికి మరియు ఆస్వాదించడానికి BSNL పబ్లిక్ Wi-Fi హాట్ స్పాట్ నెట్వర్క్ కి కనెక్ట్ చేయండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo