bsnl free offer beats jio airtel august 2025
టారిఫ్ రేట్లు పెంచిన నటి నుంచి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త ఆఫర్స్ తో యూజర్‌లను ఆకర్షించే పనిలో ఉండగా, ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL మాత్రం ఉచిత పథకాలతో యూజర్లను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు తక్కువ ధరలో ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించిన కంపెనీ, ఇప్పుడు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన గొప్ప ఆఫర్ తో మరింత చర్చనీయాంశంగా మారింది. అదే, ‘బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్’ మరియు ఈ ఆఫర్ తో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలైన Jio, Vi మరియు Airtel లకు గట్టి పోటీగా మారింది.
బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ లో భాగంగా ఆజాదీ కా ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తీసుకునే వారికి కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల అన్ లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే, కొత్త సిమ్ కార్డ్ తో 30 రోజులు అన్ లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా అందించే కొత్త ప్లాన్ అందించింది.
అయితే, ఈ బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ కేవలం ఆగస్టు 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ మరియు ఈ ఆఫర్ ఈ నెలతో ముగుస్తుంది. అయితే, బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ తో కొత్త సిమ్ తీసుకునే వారికి నెల మొత్తం ఉచిత సేవలు అందిస్తుంది. మీరు బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ తో కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటే ఆగస్టు 31 లోపుగా తీసుకుంటే, ఈ ఉచిత ఆఫర్ ను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.
Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ తో మొదలైన vivo T4R 5G ఫస్ట్ సేల్.!
బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ తో రీఛార్జ్ చేయాలంటే కేవలం ఒక్కరూపాయి చెల్లిస్తే సరిపోతుంది. కొత్త సిమ్ కార్డ్ తో పాటు ఈ రీఛార్జ్ కూడా చేసి అందిస్తున్నారు. ఈ ప్లాన్ కేవలం ఒక్క రూపాయితో 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, 30 రోజులు డైలీ 2 జీబీ స్పీడ్ మరియు 30 రోజులు డైలీ 100SMS లిమిట్ లభిస్తుంది.
పెరిగిన టారిఫ్ రేట్లతో సతమతమవుతున్న బడ్జెట్ ధరలకు ఈ ఆఫర్ గొప్ప వరం అవుతుందని కొంత మంది బడ్జెట్ యూజర్లు చెబుతున్నారు. అయితే, బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ మరియు డేటా స్పీడ్ ను గురించి కూడా కొత్త ఆలోచిస్తున్నట్లు మరి కొందరు చెబుతున్నారు. మొత్తానికి, 2025 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ గొప్ప ఉచిత ఆఫర్ ను ప్రజల కోసం అందించినట్లు మనం చూడవచ్చు.