BSNL ధమాఖా : BSNL 4G సేవలు మొదలు, సిమ్ కార్డ్ అప్గ్రేడ్ తో 2GB ఉచిత డేటా కూడా అందిస్తోంది

HIGHLIGHTS

ప్రస్తుతానికి దేశంలో మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలు, దేశంలో 4G సేవలను అందిస్తున్నాయి.

BSNL ధమాఖా : BSNL 4G సేవలు మొదలు,  సిమ్ కార్డ్ అప్గ్రేడ్ తో 2GB ఉచిత డేటా కూడా అందిస్తోంది

BSNL కూడా 4G సేవలను పరీక్షించడం ప్రారంభించింది.  BSNL వినియోగదారులకు 4G సిమ్ కార్డును అప్గ్రేడ్ చేయడాన్ని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. పాత సిమ్ నుండి కొత్త  సిమ్ కి మార్చడానికి కంపెనీ ఎటువంటి ఫీజులు తీసుకోవడం లేదు మరియు 2GB డేటా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రస్తుతానికి దేశంలో మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలు, దేశంలో 4G సేవలను అందిస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, BSNL ఇంకా వాణిజ్యపరంగా 4G సర్వీసును ప్రారంభించలేదు. ప్రస్తుతం, గుజరాత్ టెలికాం సర్కిల్లో సేవలను పరీక్షించడం ద్వారా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభమైంది. రాబోయే కాలంలో దేశంలోని ఇతర 19 టెలికం సర్కిళ్లలో ఈ సేవను ప్రారంభించవచ్చు.

BSNL ఇప్పటికే 2100MHz బ్యాండ్ 4G సేవలను ప్రారంభించేందుకు లైసెన్స్ పొందింది. ఈ సంస్థ ప్రస్తుతం ఈ బ్యాండ్ను 3G సర్వీసు కోసం ఉపయోగిస్తోంది. ఇది ఇంకా 4G స్పెక్ట్రమ్కు అప్గ్రేడ్ చేయబడలేదు. ప్రస్తుతానికి, కంపెనీ 3G సర్వీసును ఉపయోగిస్తుంది. ఈ స్పెక్ట్రం 4G సర్వీసును ఉపయోగిస్తుంది. 

కంపెనీలో  5 మిలియన్ల మంది వినియోగదారులు ఇంటర్నెట్ లాభాలను పొందగలరు. 4G సేవ పరీక్ష సమయంలో 24.6 Mbps డౌన్లోడ్ మరియు 9.25 Mbps అప్లోడ్ వేగం నమోదైనది. BSNL వినియోగదారులు ప్రస్తుతం ఈ సేవను ఆస్వాదించడానికి ఎంచుకున్నారు. 4G సేవ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళతో సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రారంభిస్తోంది.

 బిఎస్ఎన్ఎల్ టెలికాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  46 సిటీలలో 4 జి సర్వీసులను ప్రారంభించింది. కానీ అది వాణిజ్యపరంగా కాదు (ఎంపిక చేసుకున్నకొంతమంది   వినియోగదారులకు మాత్రమే అందించబడుతుంది). అదనంగా, గత నెలలో కంపెనీ 5G సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందించడం గురించి టెక్నాలజీ కంపెనీ అయిన ఎరిక్సన్ తో జతకలిసింది.  ఇదే నిజమైతే, ఇతర మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలకు కూడా బిఎస్ఎన్ఎల్ 4 జి సర్వీసుల ప్రారంభం నుండే సవాలు చేయగలవు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo