కేవలం రూ.397 కే సంవత్సరం మొత్తం సర్వీస్: BSNL ధమాకా అఫర్

Updated on 01-Oct-2021
HIGHLIGHTS

BSNL కొత్త ఆఫర్లు మరియు ప్లాన్స్

తక్కువ రీఛార్జ్ తో ఎక్కువ వ్యాలిడిటీ

అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటా

BSNL(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కొత్త ఆఫర్లు మరియు ప్లాన్స్ తో తన కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఇటీవలి కాలంలో కూడా  చాలా బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ అందించింది. అయితే, తక్కువ రీఛార్జ్ తో ఎక్కువ వ్యాలిడిటీ మరియు ఉచిత డేటా అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేసే బెస్ట్ ప్లాన్లను కూడా బిఎస్ఎన్ఎల్ అందించింది . వాటిలో, కేవలం 397 రూపాయలకే పూర్తి సంవత్సరం వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్ ను బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లతో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :