BSNL జబర్దస్ అఫర్: నెలకు రూ.100 ఖర్చుతోనే కాలింగ్ మరియు డేటా అందుకోండి.!
BSNL తన కస్టమర్లకు అద్భుతమైన అఫర్ అందించింది
నెలకు కేవలం రూ.100 ఖర్చుతోనే కాలింగ్, డేటా మరియు ఇతర ప్రయోజనాలు అందుకోండి
BSNL యొక్క ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలుసుకోండి
BSNL జబర్దస్ అఫర్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన కస్టమర్లకు అద్భుతమైన అఫర్ అందించింది. నెలకు కేవలం 100 రూపాయల ఖర్చుతోనే కాలింగ్, డేటా మరియు ఇతర ప్రయోజనాలను మీరు BSNL తన కస్టమర్లకు ఈ అఫర్ ద్వారా అందిస్తోంది. అదే Rs.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో కస్టమర్లకు నెలకు కేవలం 100 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. BSNL యొక్క ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలుసుకోండి.
SurveyBSNL Rs.1,198 Plan:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క ఈ రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి నప్పుతుంది. ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 3GB డేటా మరియు 30 SMS లను అందిస్తుంది. ఈవిధంగా ప్రతీ నెలా మీకు కాలింగ్, డేటా మరియు SMS లాభాలు అందుతాయి. అంటే, 12 నెలలు (365 days) మీరు కాలింగ్, డేటా మరియు SMS లాభాలను ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
రూ.1,198 ప్లాన్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ.99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. అయితే, కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు. కానీ, తక్కువ ధరలో రెగ్యులర్ వాడకానికి ఈ ప్లాన్ సరిపోతుంది.
అతితక్కువ ధరలో మరిన్ని ప్రయోజాలను అందించే మరొక ప్లాన్ కూడా వుంది. అదే BSNL రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో మీకు 365 రోజుల వ్యాలిడిటీ అందుతుంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజాలను క్రింద చూడవచ్చు.
BSNL రూ.797:
BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 300 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే, ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు.
మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్స్ కోసం Click Here