BSNL Best Plans: ప్రతిరోజూ 3GB డేటా అందించే ప్లాన్స్ ప్రారంభ దర Rs. 78 నుండి మొదలవుతాయి.

HIGHLIGHTS

BSNL తన వినియోగదారులకు 3 GB రోజువారీ డేటాతో ప్రీపెయిడ్ ప్లాన్‌ లను అందిస్తోంది

ఎక్కువగా డేటా కోరుకునే వారి కోసం BSNL బెస్ట్ ప్లాన్స్ కేవలం 78 రూపాయల ప్రారంభ దరతో మరియు డైలీ 3GB హాయ్ స్పీడ్ డేటాతో వస్తాయి.

మీరు అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా పొందుతారు.

BSNL Best Plans: ప్రతిరోజూ 3GB డేటా అందించే ప్లాన్స్ ప్రారంభ దర Rs. 78 నుండి మొదలవుతాయి.

BSNL తన వినియోగదారులకు 3 GB  రోజువారీ డేటాతో ప్రీపెయిడ్ ప్లాన్‌ లను అందిస్తోంది. ఈ కంపెనీకి ఇప్పటికీ ప్రతిచోటా 4 జి నెట్‌వర్క్ లేనప్పటికీ, వారు కూడా తమ వినియోగదారులకు లేదా భారతదేశంలో వినియోగదారులకు ఉత్తమమైన 3G ప్లాన్ ‌లను అందించడం తప్పక వేరే మార్గం లేదని చెప్పవచ్చు. కానీ,  వినియోగదారుల కోసం, BSNL ప్రతిరోజూ క్రొత్త ప్లాన్స్ తెస్తూనే ఉంది. ఎక్కువగా డేటా కోరుకునే వారి కోసం BSNL బెస్ట్ ప్లాన్స్ కేవలం 78 రూపాయల ప్రారంభ దరతో మరియు డైలీ 3GB హాయ్ స్పీడ్  డేటాతో వస్తాయి.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL రూ .78 రీఛార్జ్ ప్లాన్

78 రూపాయల ధరలో వచ్చే ఈ రీఛార్జ్ ప్లాన్,  మీకు 3GB రోజువారీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 8 రోజులు మాత్రమే, కానీ దానితో లభించే సౌలభ్యం తక్కువ వ్యాలిడిటీలో కూడా ఎక్కువ లాభాలను ఇస్తుంది. ఇది కాకుండా, ఈ ప్లాన్ లో మీరు బిఎస్ఎన్ఎల్ నుండి అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. అయితే, దీని పైన  FUP ని పరిశీలిస్తే, మీకు రోజుకు 250 నిమిషాలు లభిస్తాయి. ఈ ప్లాన్ BSNL యొక్క అన్ని సర్కిళ్లలో అందుబాటులో లేదు.

BSNL STV 247: రీఛార్జ్ ప్లాన్

ఈ BSNL ప్లాన్ గురించి చర్చిస్తే, ఈ ప్లాన్ లో మీరు 3GB రోజువారీ డేటాను పొందుతారు.  ఇందులో, మీరు అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా పొందుతారు. అయితే, FUP పరిమితి కూడా విధించింది, ఇది ప్రతి రోజూ 250 నిమిషాల కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 36 రోజులు. ఈ ప్లాన్ భారతదేశంలోని దాదాపు అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉంది.

BSNL PV 997 రీఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్ తో, వినియోగదారులు 3GB రోజువారీ డేటా యొక్క ప్రయోజనాన్ని పొందుతారు, కానీ ఇది అందరికీ కాదు. ఈ రీఛార్జ్ ప్లాన్ ‌ను తమ FRC ప్లాన్ ‌గా మొదటిసారి తీసుకునే వారికి మాత్రమే BSNL అందిస్తుంది. ఈ ప్లాన్ ధర 997 రూపాయలు మరియు దీనిని FRC కూపన్‌ గా మాత్రమే రీఛార్జ్ చేయవచ్చు. ఈ ప్లాన్ మీకు 3GB రోజువారీ డేటాను కూడా ఇస్తుంది, ఇది కాకుండా, మీరు 250 నిమిషాలతో అపరిమిత కాలింగ్ FUP ని కూడా పొందుతారు. ఈ ప్లాన్ అన్ని బిఎస్ఎన్ఎల్ సర్కిళ్లలో అందుబాటులో ఉంది.

BSNL రూ. 1999 రీఛార్జ్ ప్లాన్

ఇది మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ నుండి లభించే అత్యంత ఖరీదైన 3 జిబి డేటా ప్లాన్ల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ ప్లాన్ 3 జీబీ డేటాతో వచ్చే అత్యంత ఖరీదైన ప్లాన్ అని కూడా చెప్పవచ్చు. ఈ ప్లాన్ లో మీకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ లో మీరు అపరిమిత కాలింగ్‌ కోసం రోజుకు 250 నిమిషాల FUP పరిమితిని పొందుతారు. ఇది కాకుండా, మీరు ఈ ప్లాన్ లో రోజుకు 100SMS లను అందుకుంటారు. ఈ ప్లాన్ అన్ని బిఎస్ఎన్ఎల్ సర్కిళ్లలో అందుబాటులో ఉంది, కానీ మీరు లడఖ్, జమ్మూ కాశ్మీర్ మినహా అండమాన్ మరియు నికోబార్లలో తీసుకోలేరు.

గమనిక: BSNL యొక్క ఇతర ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి! 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo