BSNL Best Plan which offers 72 days unlimited benefits
BSNL Best Plan: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు బడ్జెట్ ధరలో చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్లాన్స్ చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. ఈరోజు అటువంటి బెస్ట్ ప్లాన్ లలో ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూడనున్నాము. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే చాలు 72 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు.
బడ్జెట్ ధరలో 72 రోజుల వ్యాలిడిటీ తో బిఎస్ఎన్ఎల్ అందించిన రూ. 485 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 72 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందుతాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజు కేవలం రూ. 6.73 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే, లాభాలు మాత్రం అనేకం అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ 72 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 72 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. ఇదే కాదు డైలీ 2 జీబీ వేగవంతమైన 4G డేటా అందిస్తుంది మరియు ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. అలాగే, డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది.
Also Read: వన్ డే బిగ్ డీల్స్: జెబ్రోనిక్స్ టాప్ 5.1 Dolby సౌండ్ బార్ లను అతి చవక ధరలో అందుకోండి.!
దీనితో పాటు మరో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా యూజర్లకు అతి తక్కువ ధరలో 5 నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 997 రూపాయల బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం.
ఇది కూడా బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ కేవలం రూ. 997 రూపాయల రీఛార్జి తో వస్తుంది మరియు ఐదు నెలల పాటు అన్లిమిటెడ్ ప్రయోజనాలు తీసుకొస్తుంది . ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, ప్రతిరోజూ 2 జీబీ వేగవంతమైన డేటా కూడా అందిస్తుంది. అదనంగా, ఈ లిమిట్ క్లోజ్ అయిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో కూడా డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం లభిస్తుంది.