BSNL తన కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ ఇదే.!
బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం చాలా గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తుంది
తక్కువ ధరలో అన్ని లాభాలను అందించే గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్
ప్రభుత్వ టెలికాం అందించే బడ్జెట్ ప్లాన్
BSNL: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం చాలా గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్
ఆఫర్ చేస్తుంది. ఇందులో తక్కువ ధరలో అన్ని లాభాలను అందించే గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి. ఈరోజు బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అతి తక్కువ ధరలో అన్ని లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలియజేయనున్నాము. ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో తెలుసుకుందామా.
Surveyఏమిటా BSNL బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్?
సంవత్సరం మొత్తం కాలింగ్, డేటా మరియు SMS లాభాలు అందించే బడ్జెట్ ప్లాన్ ఒకటి వుంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నెలకు కేవలం రూ. 100 రూపాయలు ఖర్చు లో అన్ని లాభాలను అందిస్తుంది. అందుకే, బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL రూ. 1,199 ప్రీపెయిడ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,199 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అయితే, ఈ వ్యాలిడిటీ డైరెక్ట్ గా కాకుండా 12 నెలల చొప్పున విభజించబడుతుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వచ్చే లాభాలు 12 నెలల పాటు సమానంగా అందించబడతాయి.

ఇక బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 12 నెల పాటు ప్రతి నెలా 300 మినిట్స్ కాలింగ్, నెలకు 3GB డేటా మరియు నెలకు 30 SMS ల చొప్పున అందించబడతాయి. ఈ ప్లాన్ తో కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు అందిస్తుంది.
Also Read: 200MP ZEISS కెమెరాతో లాంచ్ కి రెడీ అయిన vivo X200 series స్మార్ట్ ఫోన్స్.!
అయితే, ఈ ఫ్రీ బైస్ లిమిట్ ముగిసిన తర్వాత రెగ్యులర్ ఛార్జ్ లు వర్తిస్తాయి. అంటే, లోకల్ కాల్ కి నిమిషానికి రూ. 1, STD కాల్ కి నిమిషానికి రూ. 1.3 పైసలు, లోకల్ SMS కోసం 80 పైసలు, నేషనల్ SMS కోసం 1.20 పైసలు ఛార్జ్ చేస్తుంది. అలాగే, 1MB డేటా కోసం 25 పైసలు ఛార్జ్ చేస్తుంది.
మరిన్ని బెస్ట్ BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
