BSNL జబర్దస్త్ అఫర్: తక్కువ ఖర్చుతో సంవత్సరం అంతా ఆనందించండి.!

Updated on 03-Feb-2023
HIGHLIGHTS

తక్కువ ఖర్చుతో సంవత్సరం అంతా ఆనందించండి

డేటా మరియు SMS లతో సహా అన్ని ప్రయోజనాలు అందుకోండి

BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

BSNL జబర్దస్త్ అఫర్: తక్కువ ఖర్చుతో సంవత్సరం అంతా ఆనందించండి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్లకు అఫర్ చేస్తున్న బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ BSNL Rs.1,198 ప్లాన్ తో కస్టమర్లు తక్కువ ఖర్చుతో సంవత్సరం అంతా ఆనందించంవచ్చు. ఈ ప్లాన్ పూర్తిగా 365 రోజులు కాలింగ్, డేటా మరియు SMS లతో సహా అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి తెలుసుకోండి. 

BSNL Rs.1,198 Plan:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క ఈ రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి నప్పుతుంది. ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 3GB డేటా మరియు 30 SMS లను అందిస్తుంది. ఈవిధంగా ప్రతీ నెలా మీకు కాలింగ్, డేటా మరియు SMS లాభాలు అందుతాయి. అంటే, 12 నెలలు (365 days) మీరు కాలింగ్, డేటా మరియు SMS లాభాలను ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

రూ.1,198 ప్లాన్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ.99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. అయితే, కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు. కానీ, తక్కువ ధరలో రెగ్యులర్ వాడకానికి ఈ ప్లాన్ సరిపోతుంది. 
అతితక్కువ ధరలో మరిన్ని ప్రయోజాలను అందించే మరొక ప్లాన్ కూడా వుంది. అదే BSNL రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో మీకు 365 రోజుల వ్యాలిడిటీ అందుతుంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజాలను క్రింద చూడవచ్చు.     

BSNL రూ.797:

BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే, ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు.
మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్స్ కోసం Click Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :