BSNL: చాలా తక్కువ ఖర్చుతోనే 65 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందుకోండి.!
BSNL యూజర్లకు బెస్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి
తక్కువ ఖర్చుతోనే 65 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్
ఈ బెస్ట్ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలు తెలుసుకోండి
BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ) యూజర్లకు బెస్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు చాలా తక్కువ ఖర్చుతోనే 65 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్ కూడా ఒకటి వుంది ఈ ప్లాన్ తక్కువ ఖర్చులో 65 రోజుల అన్లిమిటెడ్ లాభాలు మీకు అందిస్తుంది. BSNL రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. BSNL యొక్క ఈ బెస్ట్ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలు తెలుసుకోండి.
SurveyBSNLRs.319 Plan:
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్ లలో ఒకటిగా చెబుతారు. ఈ ప్లాన్ రీచార్జ్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అంటే, పూర్తిగా 65 రోజులు హోమ్ నెట్ వర్క్ మరియు ముంబై, ఢిల్లీ (MTNL) లలో కూడా రోమింగ్ లో కూడా ఎటువంటి చింతా లేకుండా కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, ఈ ప్లాన్ తో 300 SMS మరియు 10GB ప్రయోజనాలు కూడా మీకు అందుతాయి.
ఇక ఇటివంటి మరొక బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూసినట్లయితే, మీరు రూ.1,198 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
BSNL Rs.1,198 Plan:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క ఈ రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి నప్పుతుంది. ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 3GB డేటా మరియు 30 SMS లను అందిస్తుంది. ఈవిధంగా ప్రతీ నెలా మీకు కాలింగ్, డేటా మరియు SMS లాభాలు అందుతాయి. అంటే, 12 నెలలు (365 days) మీరు కాలింగ్, డేటా మరియు SMS లాభాలను ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
రూ.1,198 ప్లాన్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ.99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. అయితే, కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు. కానీ, తక్కువ ధరలో రెగ్యులర్ వాడకానికి ఈ ప్లాన్ సరిపోతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile