BSNL: ఈ నెల చివరితో క్లోజ్ కానున్నరెండు టాప్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే..!!

HIGHLIGHTS

మరో వారంలో ముగియనున్న BSNL బెస్ట్ ప్లాన్స్

ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లను మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి

BSNL కస్టమర్లకు అదనపు వ్యాలిడిటీని అఫర్ చేసే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్

BSNL: ఈ నెల చివరితో క్లోజ్ కానున్నరెండు టాప్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే..!!

బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. కస్టమర్లకు అధిక లాభాలను అందించే రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ను BSNL త్వరలో నిలిపివేయనునట్లు డెడ్ లైన్ ప్రకటించింది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లను 2022 మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. మరొక వారంలో ముగియనున్న ఆ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.2,399 మరియు రూ.2,999. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా BSNL కస్టమర్లకు అదనపు వ్యాలిడిటీని అఫర్ చేసే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ గా నిలిచాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క రూ. 2399 ప్లాన్‌ ఒక సంవత్సరం చెల్లుబాటుతో అందుబాటులో ఉంది. అయితే, మార్చి 31, 2022 లోపు కనుక మీరు ఈప్లాం రీఛార్జ్ చేసుకుంటే 60 రోజుల అదనపు ఉచిత వ్యాలిడిటీని పొందుతారు. అంటే, పూర్తిగా రెండు నెలల వ్యాలిడిటీ ఫ్రీ గా అందుకోవచ్చు. BSNL యొక్క ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది మరియు అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో డైలీ 100SMS లను మరియు ErosNow సబ్ స్క్రిప్షన్ కూడా కాంప్లిమెంటరీ గా అందిస్తుంది.

BSNL రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క రూ. 2,999 ప్లాన్‌ కూడా వాస్తవానికి ఒక సంవత్సరం చెల్లుబాటుతో అందుబాటులో ఉంది. అయితే, మార్చి 31, 2022 లోపు కనుక మీరు ఈప్లాన్  రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల అదనపు ఉచిత వ్యాలిడిటీని పొందుతారు. అంటే, పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ ఫ్రీ గా అందుకోవచ్చు. BSNL యొక్క ప్లాన్ డైలీ 3GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది మరియు అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 100SMS లను కూడా  అందిస్తుంది.

 BSNL బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo