BSNL 4G సునామి : రూ.96 రూపాయలకే డైలీ 10GB 4G డేటా

HIGHLIGHTS

ఈ ప్లాన్ నిజంగా ఒక వరమే అవుతుంది.

BSNL 4G సునామి : రూ.96 రూపాయలకే డైలీ 10GB 4G డేటా

ప్రభుత్వ టెలికం సంస్థ అయినటువంటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ఇప్పుడు తన 4G సర్వీస్ మరియు ప్లాన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం,BSNL ప్రకటించిన రెండు కొత్త 4G డేటా ప్లాన్లతో ఇతర టెలికం సంస్థలకు ముచ్చెమటలు పట్టించనుంది. ఈ ప్లాన్లను, రూ.96 మరియు రూ. 236 ధరలతో ప్రకటించింది. అయితే, ఈ రెండు ప్లాన్లు కూడా వినియోగదారులకు రోజుకు 10GB హై స్పీడ్ డేటాతో ప్రకటించడం ఇందుకు కారణం అని చెప్పొచ్చు. ఈ ప్లాన్లను BSNL 4G సేవను అందిస్తున్నటువంటి, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా, కేరళ, కలకత్తా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, చెన్నై మరియు తమిళనాడు వంటి సర్కిళ్లలో ప్రకటించింది.              

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ప్లాన్ గురించి ముందుగా టెలికంటాక్ నివేదించింది. దీని ప్రకారం, ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల విషయానికి వస్తే, వీటిలో రూ.96 డేటా ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఇది డైలీ 10GB డేటాని అందిస్తుంది. అంటే, పూర్తి 28 రోజులకు గాను రోజుకు 10GB డేటాతో మొత్తంగా 280GB ల హై స్పీడ్ డేటాతో వస్తుంది. డేటా అధికంగా అవసరమున్న వినియోగదారుకు ఈ ప్లాన్ నిజంగా ఒక వరమే అవుతుంది.

ఇక రూ.236 రుపాయల డేటా ప్లాన్ విషయానికి వస్తే, ఇది 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే, మరియు ఇది పూర్తి 84 రోజులకు గాను గరిష్టంగా 2,360GB ల హై స్పీడ్ డేటాతో వస్తుంది. డేటా అధికంగా అవసరమున్న వినియోగదారుకు ఈ ప్లాన్ నిజంగా ఒక వరమే అవుతుంది. ఈ ప్లాన్లతో పోల్చి చూస్తే, ప్రధాన 4G టెలికం సంస్థలనటువంటి, జియో మరియు ఎయిర్టెల్ వంటి సంస్థల డేటా ప్లాన్లకు ఇది ఘోరమైన పోటీని ఇస్తుంది. ఈ

అయితే, జియో మరియు ఎయిర్టెల్ వంటి సంస్థల యొక్క డేటా స్పీడ్ తో పోలిస్తే మాత్రం BSNL యొక్క 4G స్పీడ్ కొంత తక్కువగా ఉంటుంది. కానీ, ఎక్కువ డేటాని అందించే ప్లాన్లలో మాత్రం ఈ రెండు ప్లాన్లు కూడా ముందు వరుసల్లో నిలవడం మాత్రం ఖాయం.                                                     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo