రూ.225 ఖర్చుతోనే జీవిత కాలం వ్యాలిడిటీ అందించే ప్లాన్ గురించి మీకు తెలుసా.!

HIGHLIGHTS

రూ.225 ఖర్చుతోనే జీవిత కాలం వ్యాలిడిటీ అందించే ప్లాన్

కారుచవక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

ఈ బెస్ట్ బడ్జెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ను అందిస్తోంది

రూ.225 ఖర్చుతోనే జీవిత కాలం వ్యాలిడిటీ అందించే ప్లాన్ గురించి మీకు తెలుసా.!

రూ.225 ఖర్చుతోనే జీవిత కాలం వ్యాలిడిటీ అందించే ప్లాన్ గురించి మీకు తెలుసా? అవునండి ఇటువంటి కారుచవక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి వుంది. ప్రభుత్వ టెలికం సంస్థ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) ఈ బెస్ట్ బడ్జెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అఫర్ ను అందిస్తోంది. MTNL అందిస్తున్న ఈ రూ.225 (జీవన్ సాతి) (JS) ప్రీపెయిడ్ ప్లాన్ తో పూర్తి Life Time వ్యాలిడిటీని అందిస్తోంది. మరి ఈ అత్యంత చవకైన లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

MTNL Rs.225 (JS) Plan:

ఈ ప్లాన్ కోసం మీరు కేవలం రూ.225 రూపాయలు చెల్లించి ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ ప్లాన్ రీఛార్జ్ తో లైఫ్ టైం వ్యాలిడిటీ అందుతుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు రీఛార్జ్ తో మీకు 100 నిముషాల ఉచిత కాలింగ్ మినిట్స్ కూడా అందుతాయి. అంటే, కేవలం 225 రూపాయల ఖర్చుతోనే జీవితకాలం వ్యాలిడిటీతో పాటుగా 100 నిముషాల కాలింగ్ మినిట్స్ కూడా మీరు పొందుతారు.

ఒక కాలింగ్ రేట్ మరియు ఇతర వివరాల్లోకి వెళితే, హోమ్ నెట్వర్క్ పైన లోకల్ మరియు STD కాలింగ్ కోసం నిముషానికి రూ.0.20 (20పైసలు) ఛార్జ్ చేయబడుతుంది. ఇక వీడియో కాలింగ్ కోసం నిముషానికి రూ.0.60 మరియు ఇతర నెటవర్క్ కోసం రూ.0.60 ఛార్జ్ చేయబడుతుంది. ఇక SMS ఛార్జ్ విషయానికి వస్తే, లోకల్ SMS కోసం Rs.0.50/SMS, నేషనల్ SMS కోసం Rs.0.50/SMS మరియు ఇంటర్నేషనల్ SMS కోసం రూ.4 నుండి రూ.5 వరకు చెల్లించాలి. చివరిగా డేటా విషయానికి వస్తే, 1MB డేటా వినియోగానికి 3పైసలు చెల్లించాలి.

గమనిక: MTNL నెట్ వర్క్ కేవలం ఢిల్లీ మరియు ముంబై నగరాలకు మాత్రమే వర్తిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఈ ప్లాన్ చెల్లుబాటులో లేదు. కానీ, దేశంలో అత్యంత చవకైన లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుపడం కోసం వివరాలు అందించాము.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo