Jio, Airtel, BSNL మరియు Vi టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ ఇవే..!!

Updated on 01-Apr-2022
HIGHLIGHTS

Jio, Airtel, BSNL, Vi టెలికం ఆపరేటర్ అందిస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ కేవలం బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ ప్రయోజాలను తీసుకువస్తాయి

టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్స్

టెలికం ఆపరేటర్ అందిస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులు ఎక్కువగా వెతుకుతారు. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ కేవలం బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ ప్రయోజాలను  తీసుకువస్తాయి. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు మరిన్నిలాభాలను ఈ ప్లాన్ లో భాగంగా తీసుకువస్తాయి. అందుకే, టెలికం సంస్థలు వారి కస్టమర్లను ఆకర్షించే విధంగా తక్కువ ఖర్చులో మరిన్ని ప్రయోజనాలతో కొన్ని బెస్ట్ ప్లాన్స్ అందించాయి. మరి జియో,BSNL, ఎయిర్టెల్ మరియు Vi టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ గురించి ఈరోజు చుద్దాం.

రిలయన్స్ జియో యొక్క బడ్జెట్ ప్లాన్స్

రిలయన్స్ జియో యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ 209 రూపాయలకు వస్తుంది. వాస్తవానికి, రూ.155 రూపాయల ప్లాన్ ఉన్నాకూడా, అది కేవలం జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. రూ.209 ప్లాన్ ప్రకారం, కస్టమర్లు 28 రోజుల పాటు డైలీ 1GB చొప్పున మొత్తం 28GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS  లను అందిస్తుంది. అంతేకాదు, జియో యాప్‌ లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. జియో లేటెస్ట్ బెస్ట్ ప్లాన్ ను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్ 259 రూపాయలకు వస్తుంది మరియు ఇది పూర్తి నెల రోజులకు(30,31)రోజుకు 1.5 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

ఎయిర్టెల్ యొక్క బడ్జెట్ ప్లాన్స్

ఎయిర్టెల్ యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ రూ.179 రూపాయలకు వస్తుంది. వినియోగదారులకు ఇది 28 రోజుల కాలానికి గాను మొత్తం 2 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్ని నెట్‌వర్క్‌లకు 300 SMSలను అందిస్తుంది. అలాగే, ప్రైమ్ వీడియోలో ఉచిత ట్రయల్, ఉచిత హాలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్‌ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇక మరొక బెస్ట్ ప్లాన్ 265 రూపాయలకు వస్తుంది. ఇది డైలీ 1 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, ప్రైమ్ వీడియో ఉచిత ట్రయల్, ఉచిత హాలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్‌ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

BSNL జియో యొక్క బడ్జెట్ ప్లాన్స్

BSNL యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ 1083 రూపాయలకు వస్తుంది. ఈ రూ. 108 ప్లాన్ తో కస్టమర్లు 28 రోజుల పాటు డైలీ 1GB చొప్పున మొత్తం 28GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS  లను అందిస్తుంది. BNSL యొక్క రెండవ ప్లాన్ 153 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అంతేకాదు, 28 రోజుల ఉచిత PRBT(పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్) తో కూడా వస్తుంది.

వోడాఫోన్ ఐడియా యొక్క బడ్జెట్ ప్లాన్స్

Vodafone Idea చౌకైన 28 రోజుల ప్లాన్‌ను రూ.179 రూపాయలకు వస్తుంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు 28 రోజులకు గాను మొత్తం 2 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 300 SMSలతో సహా  Vi సినిమాలు మరియు టీవీలకు ఉచిత యాక్సెస్ ఇవ్వబడుతుంది. Vi యొక్క రెండవ ప్లాన్ 269 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, Vi Movies & TV Basic కి యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :