జియో vs ఎయిర్టెల్ vs BSNL vs Vi : అఫర్ చేస్తున్న అత్యంత చవక ప్లాన్స్.!
అత్యంత చవక ప్లాన్స్ గురించి ఈరోజు చుడనున్నాము
జియో, BSNL , ఎయిర్టెల్ మరియు (Vi) అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్
తక్కవ ధరలో వచ్చినా ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్
టెలికం కంపెనీలైన జియో, BSNL , ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా (Vi) అఫర్ చేస్తున్న అత్యంత చవక ప్లాన్స్ గురించి ఈరోజు చుడనున్నాము. అదీకూడా కేవలం 100 రూపాయల కంటే తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి మాత్రమే చూడనున్నాము. ఈ ప్లాన్స్ కేవలం తక్కవ ధరలో వచ్చినా ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ గా పేరుపొందాయి. మరింకెందుకు ఆలశ్యం ఆ బెస్ట్ ప్లాన్ ఏమిటో తెలుసుకుందాం పదండి.
SurveyJio యొక్క అత్యంత చవకైన ప్లాన్
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అత్యంత చవకైన ప్లాన్ ను కేవలం రూ.26 రూపాయలకే అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే కస్టమర్లు 2GB డేటాని 28 రోజుల వ్యాలిడిటీతో పొందుతారు. ఇది కాకుండా జియో యొక్క రూ. 62 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా వుంది మరియు ఇది 28 రోజుల చెల్లుబాటుతో 6GB డేటాను అందిస్తుంది.
ఎయిర్టెల్ యొక్క అత్యంత చవకైన ప్లాన్
ఎయిర్టెల్ యొక్క అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, రూ.99. ప్లాన్ గురించి చెప్పొచ్చు. ఈ ప్లాన్ తో కస్టమర్‌లు 28 రోజుల వ్యాలిడిటీని రూ. 99 టాక్ టైమ్‌ను పొందుతారు. ఈ మొత్తాన్ని యూజర్లు కాల్ చేయడానికి లేదు మెసేజెస్ కోడం కూడా ఉపయోగించవచ్చు. అదనంగా, ఈ ప్లాన్ తో కస్టమర్లు 200 MB డేటాను కూడా పొందుతారు.
BSNL యొక్క అత్యంత చవకైన ప్లాన్
BSNL యొక్క చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లలో మొదటిది 49 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో 100 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈ ప్లాన్‌ను సెకండరీ SIM కార్డ్ కోసం ఉపయోగించవచ్చు, ఇది మీ ఖర్చులను తగ్గిస్తుంది మరియు మీరు రెండు SIM లను ఉపయోగించవచ్చు.
వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క అత్యంత చవకైన ప్లాన్
వోడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారులకు 98 రూపాయల ధరలో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 15 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 200 MB డేటాను అందిస్తుంది.
మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile