యూజర్లు నెలకు సరాసరిన ఇంత డేటా వాడుతున్నారని చెప్పిన DoT

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 09 Apr 2020
HIGHLIGHTS
  • నెలవారీ డేటా వినియోగంలో భారతదేశం ప్రపంచ అగ్రగామి.

యూజర్లు నెలకు సరాసరిన ఇంత డేటా వాడుతున్నారని చెప్పిన DoT
యూజర్లు నెలకు సరాసరిన ఇంత డేటా వాడుతున్నారని చెప్పిన DoT

భారతదేశంలో రోజూ చాలా డేటాను వినియోగిస్తున్నట్లు కనిపిస్తోంది. టెలికాం విభాగం (DoT) తన వార్షిక నివేదికలో, నెలవారీ డేటా వినియోగంలో భారతదేశం ఇప్పుడు ప్రపంచ అగ్రగామిగా ఉందని, నెలకు సగటున చందాదారుల వినియోగం 2014 లో 62 MB నుండి 2019 లో 9.66 GB కి మొత్తంగా 146 రెట్లు పెరిగిందని తెలిపింది. అంతేకాదు, డేటాను ఎక్కువ ఖర్చు లేకుండా, మిలియన్ల కొద్దీ ఉన్న పౌరులకు సరసమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశపెట్టడంతో, మొబైల్ డేటా ప్యాక్‌ యొక్క ధరలు తగ్గాయి. మరియు టెలికాం రంగంలో మరింత పోటీగా మార్చేసింది. ఇవన్నీ కలగలిపి, వినియోగదారులకు మరింత సరసమైన ధరలకె వేగవంతమైన డేటాను అందేలా చేస్తుంది.

మార్చి 2019 చివరినాటికి 636.73 మిలియన్లుగా ఉన్న ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య (బ్రాడ్‌బ్యాండ్ మరియు నేరో బ్యాండ్ రెండూ కలిపి) 2019 సెప్టెంబర్ చివరి నాటికి 687.63 మిలియన్లకు పెరిగాయని DoT చెబుతోంది. వైర్ లెస్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే చందాదారుల సంఖ్య 2019 సెప్టెంబర్ చివరి నాటికి 665.37 మిలియన్లు కాగా, వైర్‌ లైన్ ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య 22.26 మిలియన్లు. 2019 మార్చి చివరి నాటికి బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య 563.31 మిలియన్లు కాగా, నవంబర్ 19 చివరినాటికి 661.27 మిలియన్లుగా ఉంది. 2019 మార్చి నుండి 2019 సెప్టెంబర్ వరకు ఈ కాలంలో ఇంటర్నెట్ చందాదారులలో నికర పెరుగుదల 50.90 మిలియన్లు ”. అటువంటి సంఖ్యలతో, భారతదేశం ఇప్పుడు నెలవారీ డేటా వినియోగంలో ప్రపంచ అగ్రగామి నాయకుడిగా మారింది.

అందుకే పోటీగా ఉండటానికి, సర్వీసు ప్రొవైడర్లు తమ వినియోగదారులకు కాంబినేషన్ డేటా మరియు వాయిస్ కాలింగ్‌ ను అందిస్తున్నారు.  చాలామందికి రోజుకు 1GB డేటాను వాడుకోవడం అన్నది సాధారణ విషయంగా మారింది. బిఎస్ఎన్ఎల్ నుండి రిలయన్స్ జియో వరకు, ఎయిర్టెల్ మరియు మరిన్ని సంస్థల కస్టమర్లు, తమ మొబైల్ నంబర్లను ఇతర సంస్థలకు పోర్ట్ చేయకుండా ఉంచడానికి ఒకదాని పైన మరొకటి పోటీ పడుతున్నాయి.

ప్రయాణ సమయాల్లో ఇంటర్నెట్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ తో, టెలికాం ప్రొవైడర్ల నుండి అందుతున్న సర్వీస్ నాణ్యత ఏమిటని కొందరు ప్రశ్నిస్తారు. వీడియో వినియోగం మరియు గేమింగ్ కోసం ఎయిర్టెల్ ఉత్తమమైన 4 జి నెట్‌వర్క్ అని, కంటెంట్ క్రియేటర్ల కోసం  వోడాఫోన్ ఉత్తమమని ఒపెన్సిగ్నల్ నుండి ఏప్రిల్ 2020 లో వచ్చిన నివేదిక పేర్కొంది. మరోవైపు, జియో భారతదేశంలో 4 జి ల్యాండ్‌స్కేప్‌లో ఆధిపత్యం చెలాయించింది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status