ఎయిర్టెల్ యూజర్లు ఇప్పుడు ATM లు, అపోలో ఫార్మసీలు మరియు బిగ్ బజార్ నుండి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు

HIGHLIGHTS

మొబైల్ నంబర్లను రీఛార్జ్ చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

ఎయిర్టెల్ యూజర్లు ఇప్పుడు ATM లు, అపోలో ఫార్మసీలు మరియు బిగ్ బజార్ నుండి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు

ఎటువంటి ఆటంకం లేకుండా, లాక్ డౌన్ యొక్క చివరి వారంలోకి దేశం ముందుకు సాగింది. అన్ని కంపెనీలు ఇప్పటికీ ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తున్నాయి. గత వారం, రిలయన్స్ తన వినియోగదారులు తమ జియో నంబర్‌ ను ATM ల ద్వారా కూడా  రీఛార్జ్ చేయడానికి వీలుకల్పించింది. ఇక ఇప్పుడు, ఎయిర్టెల్ కూడా తన వినియోగదారులకు అదే విధమైన అవకాశాన్ని ప్రకటించింది. అధనంగా,  ఫార్మసీలు మరియు కిరాణా దుకాణాల వంటి అదనపు ఎంపికలను కూడా ఇచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పుడు, ఎయిర్టెల్ వినియోగదారులు  ఏదైనా HDFC లేదా ICICI ఎటిఎమ్‌ లోనైనా మీ ATM ద్వారా తమ మొబైల్ నంబర్లను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే, ఎయిర్టెల్ ఈ రెండు బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అధనంగా, ఎయిర్టెల్ అపోలో ఫార్మసీలు, బిగ్ బజార్ దుకాణాలతో కొద చేతులు కలిపింది. ఇవన్నీ ఎలా పని చేస్తాయనే దానిపై వివరాలు లేవు. అయితే, ఇది రిలయన్స్ జియో పథకం మాదిరిగానే పనిచేస్తుందని అంచనావేస్తున్నారు.  ప్రస్తుతానికి, మీరు ఎయిర్టెల్ ఆప్ మరియు గూగుల్ పే మరియు పేటిఎమ్ వంటి ఇతర ఆన్లైన్ సర్వీసుల ద్వారా మీ నంబరును రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, ఇది ఆ సేవలకు యాక్సెస్ లేని వ్యక్తులు వారి నంబర్లను రీఛార్జ్ చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

ఎయిర్టెల్ తన నెట్‌వర్క్ ఎటువంటి సమస్యలను ఎదుర్కోదని మరియు ఈ లాక్ డౌన్ సమయంలో సజావుగా నడుస్తుందని తెలిపింది. ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ ఒక ప్రకటనలో చెప్పినట్లుగా, “మా నెట్‌వర్క్ ఆపరేటింగ్ సెంటర్లు మరియు డేటా సెంటర్లు నెట్‌వర్క్ సజావుగా పనిచేయడానికి పూర్తిగా పనిచేస్తున్నాయి. క్రొత్త కనెక్షన్లను వేగంగా అందించడం మరియు లోపాలను త్వరగా పరిష్కరించడం కోసం మా ఫీల్డ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. అధనంగా , మేము అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్నాము మరియు డేటా డిమాండ్ పెరుగుదల అవసరాలను తీర్చడానికి సామర్థ్యాలను కూడా కలిగివున్నాము. ” 

ఎయిర్టెల్, జియో మరియు ఇతరుల సంస్థలు ఇంటి నుండి పనిచేసే వ్యక్తుల కోసం కొన్ని కొత్త ప్లాన్లను కూడా విడుదల చేశారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo