ఎయిర్టెల్ సరికొత్త ప్రీపెయిడ్ అఫర్ : డైలీ 1.4GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు 75 రోజుల వ్యాలిడిటీ

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 19 Nov 2018
HIGHLIGHTS
  • వినియోగదారులకి మరిన్ని ప్రయోజనాలను తీసుకొచ్చిన ఈ సరికొత్త ప్లాన్

ఎయిర్టెల్ సరికొత్త ప్రీపెయిడ్ అఫర్ : డైలీ 1.4GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు 75 రోజుల వ్యాలిడిటీ

ఈ మధ్యకాలంలో, ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం అనేకరకాలైన కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు తన ప్రకటించిన, సరికొత్త ప్రీపెయిడ్ ఆఫరుతో వినియోగదారులకి మంచి ప్రయోజనాలను అందించనుంది ఎయిర్టెల్. కొత్తగా ప్రకటించిన ఈ ఆఫర్ యొక్క ధర రూ. 419 మరియు ఇది అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంటుంది. దీనితో, లోకల్ STD మరియు రొమింగుతో అపరిమిత కాలింగ్ మరియు రోజువారీ 1.4GB డేటా మరియు డైలీ 100SMS ల పరిమితితో పూర్తి 75 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

airtel2--621x414.JPG

ఈ రూ. 419 ప్రీపెయిడ్ ప్రణాళికను జియో యొక్క రూ. 349 ప్రణాళికకు పోటీగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, జియో యొక్క ఈ ప్రణాళికతో, రోజువారీ 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, మరియు 100SMS ల పరిమితితో 70 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇక్కడ రోజువారీ 100 MB డేటా అదనంగా జియో అందిస్తే, ఎయిర్టెల్ 100 MB డేటాని తక్కువ ఇచ్చినా కూడా 5 రోజుల ఎక్కువ చెల్లుబాట వ్యవధితో రావడంతో ఈ రెండింటి యొక్క పూర్తి చెల్లుబాటు సమయానికల్లా  రెండు కూడా 105GB డేటాని అందిస్తాయి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
rs 419 plan airtel new prepaid plan new airtel plan
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status